NTV Telugu Site icon

Puneeth Rajkumar: పునీత్ ఆత్మతో మాట్లాడిన స్వామీజీ.. కుమార్తె కడుపున పుడతానంటూ!

Puneeth

Puneeth

Dr Sri Ramachandra Guruji Revealed that He Talked with Puneeth Rajkumar Soul: కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి రెండేళ్లు పూర్తి కావస్తోంది. అయినప్పటికీ, కర్ణాటకలో మరపురాని వ్యక్తిగా మిగిలిపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయినప్పుడు ఆయన ఆత్మతో మాట్లాడినట్లు చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డా. శ్రీ రామచంద్ర గురూజీ ఆత్మ గురించి రాజేష్ గౌడ్ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడారు. మరణానంతరం శరీరాన్ని విడిచి పెట్టినా జరిగేవన్నీ ఆత్మకు తెలుసని ఆయన అన్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎలా ఏడ్చారో తెలుస్తుందని అన్నారు. అది శరీరం కోసం వెతుకుతుందని పేర్కొన్న ఆయన అందుకే ఆత్మకు తెలియజేసేందుకు కర్మకాండలు నిర్వహిస్తాం, ఆత్మ సమయం ముగిసింది. వేరే దేహానికి వెళ్లాల్సి ఉంటుందని తెలియజేసేందుకు సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మతో సంభాషించడం కూడా సాధ్యమవుతుంది.

Buddy Trailer : మొండి **డకా ఎన్ని సార్లు వస్తావురా? ఆసక్తి రేకెత్తిస్తున్న బడ్డీ ట్రైలర్

ఆత్మ సంభాషణ ఒక శాస్త్రం అని ఆయన అన్నారు. అప్పు ఆత్మ చనిపోయిన కొద్దిరోజుల తర్వాత ఆయనతో మాట్లాడానని, ఈ సంభాషణను సోషల్‌గా ఓపెన్ చేయలేనని చెప్పారు. అది నా వ్యక్తిగత సమాచారం కోసం చేశాను. ఎందుకంటే ఆయన అభిమానులు లక్షల్లో ఉన్నారు. బహిరంగ వేదికపై చేస్తే వచ్చే ప్రశ్నలు, తట్టుకునే శక్తి మనకు ఉండదు. నేను మీ మరణం గురించి చాలా పుకార్లు ఉన్నాయి, ఇది నిజమేనా? అని అడిగితే నేను గుండె జబ్బుతో చనిపోయానని అన్నారు. మీరు శరీరాన్ని వదిలి ఇప్పుడు ఎక్కడ ఉన్నారని అడిగా, దానికి ఆయన తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నానని చెప్పాడు. నువ్వు మళ్ళీ పుట్టవా అని అడిగితే నేను దాని గురించి ఆలోచించలేదు, పుడితే నా కూతురి కడుపున పుడతానని అన్నాడని అన్నారు. ఆత్మతో సంభాషించడం వల్ల ఈ విషయం తెలిసిందన్న ఆయన పునీత్ మరణం గురించి చాలా ఉత్సుకత ఉండటంతో, ఈ పరిశోధన చేసామని అన్నారు.