NTV Telugu Site icon

Gannavaram Airport: మరోసారి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో డాక్టర్ లోకేష్ హల్ చల్

New Project (25)

New Project (25)

సీఎం జగన్ విదేశాలకు వెళ్ళే సమయంలో ఎయిర్ పోర్ట్ లో అనుమానాస్పదంగా సంచరించిన డాక్టర్ లోకేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గుండె పోటనడంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. నేడు ఢిల్లీ వెళ్లేందుకు డాక్టర్ లోకేష్ మళ్లీ గన్నవరం ఎయిర్ పోర్ట్ వచ్చారు. లోకేష్ తో శాటిలైట్ ఫోన్ గుర్తించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది దానిని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్ట్ స్టాఫ్ గన్నవరం పోలీసులకు సమాచారం అందించారు. శాటిలైట్ ఫోన్ వినియోగానికి ఇక్కడ అనుమతి లేకపోవటంతో ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. కేసు నమోదుపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు.

READ MORE: Breaking: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ క్రాష్.. హర్డ్ ల్యాండింగ్ అయినట్లు అనుమానం..

కాగా..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటన సందర్భంగా లండన్ వెళ్లే సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో శుక్రవారం రాత్రి కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంకటాయపాలెనికి చెందిన ఎన్ఆర్ఐగా గుర్తించారు. అయితే పోలీసులు తనను అకారణంగా అదుపులోకి తీసుకున్నారని డాక్టర్ లోకేష్ కుమార్ ఆరోపిస్తున్నారు. సీఎం అవినీతిని ప్రశ్నించాననే కారణంతోనే అదుపులోకి తీసుకుని హింసించారని ఆరోపించారు. ఇక గన్నవరం విమానాశ్రయంలో ఏం జరిగిందో కూడా డాక్టర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లేందుకు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు లోకేష్ కుమార్ తెలిపారు. టికెట్ ప్రింటింగ్ కోసం ఎయిర్ పోర్టుకు వెళ్లానని.. అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అదుపులోకి తీసుకున్న తర్వాత పలుచోట్ల తిప్పారని.. ఛాతీపై కొట్టారంటూ లోకేష్ కుమార్ ఆరోపించారు. అయితే ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో ఆ తర్వాత ఆస్పత్రికి తరలించారు.