Site icon NTV Telugu

Russia-Ukraine war: రష్యా ఆధీనంలోని బేకరీపై ఉక్రెయిన్ దాడి.. 28 మంది మృతి

Bakery

Bakery

Russia: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రష్యా ఆధీనంలోని లిసిచాన్స్క్ సిటీలోని బేకరీపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యన్ అధికారులు తెలిపారు. శనివారం నాడు జరిగిన ఈ దాడిలో దాదాపు 28 మంది వరకు మరణించారని తెలిపారు. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు రష్యన్ అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కకుపోయిన వారిలో 10 మందిని రక్షించినట్టు చెప్పుకొచ్చారు. అయితే, ఈ దాడిలో బేకరి పూర్తిగా కుప్పకూలిపోయింది.

Read Also: BYJUS : ఎట్టకేలకు ఉద్యోగులకు జనవరి జీతం ఇచ్చిన బైజు సీఈవో రవీంద్రన్

అయితే, కీవ్ బలగాలే దాడి చేశాయని రష్యన్ అధికారులు ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ మాత్రం ఈ ఘటనపై ఇప్పటి వరకు స్పందించలేదు. ఉక్రెయిన్ పై గత 24 గంటలుగా రష్యన్ దళాలు తీవ్రమైన దాడి చేస్తున్నాయని కీవ్ అధికారులు పేర్కొన్నారు. సుమీ ప్రాంతంలో 16 వేర్వేరు చోట్ల దాడులు చేశాయని చెప్పుకొచ్చారు. అలానే సుమీ ప్రాంతంలో సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్న రష్య నిఘా వర్గాలు, బలగాలను కీవ్​ దళాలు అడ్డుకున్నట్లు సమాచారం.

Exit mobile version