Site icon NTV Telugu

Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!

Naga Chaitnya

Naga Chaitnya

టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇప్పటికే ‘తండేల్’, ‘వృషకర్మ’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన, తాజాగా మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఒకటి తండ్రి నాగార్జునతో కలిసి చేసే మల్టీస్టారర్ కాగా, మరొకటి తన 25వ మైల్‌స్టోన్ మూవీ కావడం విశేషం.

Also Read : Abhilash : ‘బైకర్’ డైరెక్టర్ అభిలాష్‌కు అడ్వాన్స్ ఇచ్చిన భారీ చిత్రాల నిర్మాత

‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత కింగ్ నాగార్జున మరియు దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో నాగచైతన్య ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ‘బంగార్రాజు’లో తండ్రి కొడుకులుగా మెప్పించిన ఈ జోడీ, మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు సిద్ధమవుతోంది. చైతు పోషించే ఈ ‘ఇంపార్టెంట్ రోల్’ కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్. ‘బెదురులంక 2012’ చిత్రంతో తన మేకింగ్ స్టైల్‌తో ఆకట్టుకున్న దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో నాగచైతన్య తన 25వ సినిమాను చేయబోతున్నారు. ఇది ఒక వినూత్నమైన లవ్ అండ్ మ్యూజికల్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు సిద్ధమవుతున్నాయి.

Exit mobile version