Site icon NTV Telugu

Double Ismart : “డబుల్ ఇస్మార్ట్” నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ కు ముహూర్తం ఫిక్స్..

Whatsapp Image 2024 05 12 At 11.12.58 Am

Whatsapp Image 2024 05 12 At 11.12.58 Am

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ,ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ “డబుల్ ఇస్మార్ట్”..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను పూరిజగన్నాథ్ ,ఛార్మి కౌర్  గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.లైగర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అందుకున్న పూరీజగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.

Read Also : Chiranjeevi : “మదర్స్ డే” నాడు మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ వైరల్..

అలాగే హీరో రామ్ కు కూడా డబుల్ ఇస్మార్ట్ హిట్ ఎంతో అవసరం.తానూ రీసెంట్ గా నటించిన సినిమాలు అన్ని కూడా ఫ్లాప్స్ గా నిలవడంతో హీరో రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు .ఇదిలా ఉంటే ఈ సినిమా ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ ను మేకర్స్ రీసెంట్ గా ప్రారంభించారు.తాజాగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి అదిరిపో యే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ ను ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్ర యూనిట్ మే 15వ తేదీన రిలీజ్‌ చేయనుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా రిలీజ్‌ చేసింది. దీంతో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Exit mobile version