Site icon NTV Telugu

Post Office Scheme: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ. 5 లక్షలు కడితే చేతికి రూ. 10 లక్షలు.. డబుల్ ఆదాయం పక్కా

Postoffice

Postoffice

డబ్బును ఈ రోజు సేవ్ చేస్తే రేపు అది మిమ్మల్ని రక్షిస్తుంది. అందుకే సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలని సూచిస్తుంటారు నిపుణులు. మరి మీరు కూడా భారీ రాబడి అందించే పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే పోస్టాఫీస్ అందించే అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ఒక్కసారి రూ. 5 లక్షలు కడితే మెచ్యూరిటీ నాటికి చేతికి రూ. 10 లక్షలు వస్తాయి.

Also Read:Blue Drum Sales: ఒక్క హత్య ‘‘డ్రమ్‌’’ బిజినెస్‌నే దెబ్బ తీసింది.. మీరట్ మర్డర్‌తో పడిపోయిన సేల్స్..

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకంలో, 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో పెట్టుబడి భద్రంగా ఉంటుంది. గ్యారంటీ రిటర్న్స్ అందుకోవచ్చు. ఈ పథకంలో 7.5 శాతం వడ్డీరేటు అందిస్తోంది. వడ్డీ రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతం, 7.10 శాతం, 7.50 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల డిపాజిట్‌పై అత్యధికంగా వడ్డీ 7.50 శాతంగా ఉంది. కనీసం రూ. 1000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా ఎంత పెట్టుబడైనా పెట్టుకోవచ్చు.

Also Read:Govt Jobs: కష్టానికి దక్కిన ఫలితం.. ఏకంగా 10 జాబ్స్ సాధించిన గోపీకృష్ణ

సింగిల్ అకౌంట్ తెరవొచ్చు. లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీరు పోస్ట్ ఆఫీస్ పథకంలో 10 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, మీ డబ్బు 7.5% వడ్డీ రేటుతో 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు మీరు పోస్ట్ ఆఫీస్ TD పథకంలో 10 సంవత్సరాల పాటు రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే , 7.5 శాతం వడ్డీ రేటుతో, 10 సంవత్సరాల తర్వాత మీకు రూ. 10,51,175 చేతికి అందుతాయి.

Exit mobile version