NTV Telugu Site icon

Test Cricket: ఒకే టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసి 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో తెలుసా..?

Test Cricket

Test Cricket

Double Century and Five wickets in one Test Match: 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఉన్నాయి. ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఆటగాడు డబుల్ సెంచరీ చేసి, 5 వికెట్లు తీయడం అటువంటి ఘనత ఉందని తెలుసా మీకు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1877లో ఆడిన తొలి టెస్టు నుంచి కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఘనత సాధించారు. మరి ఆ ఇద్దరు గొప్ప ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం.

Rohit Sharma: శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ ఎమోషనల్ పోస్ట్..

వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డెన్నిస్ అట్కిన్సన్ 1955లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై ఈ ఘనత సాధించాడు. 5 టెస్టుల సిరీస్‌ లో నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ లో 668 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ లో అట్కిన్సన్ (219) డబుల్ సెంచరీతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 510 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 249 పరుగులకు ఆలౌటైంది. వెస్టిండీస్ తరఫున అట్కిన్సన్ 5/56 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌ లో 264/6 స్కోరు చేయడంతో మ్యాచ్ డ్రా అయింది.

World Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. సంపద రూ.8 లక్షల కోట్లు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ వెటరన్ ఆటగాడు ముస్తాక్ మహ్మద్ 1973లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుపై ఈ ఘనత సాధించాడు. సిరీస్‌ లోని రెండో టెస్టులో ముస్తాక్ (201) డబుల్ సెంచరీతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 507/6 స్కోరు చేసింది. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 156 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఫాలో ఆన్ తో రెండో ఇన్నింగ్స్‌ ను మొదలు పెట్టిన న్యూజిలాండ్ 185 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ముస్తాక్ 49 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ 166 పరుగుల తేడాతో విజయం సాధించింది.