NTV Telugu Site icon

IPL 2023 : ఆర్సీబీకి షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్

Rcb

Rcb

ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గుండె బద్దలయ్యే లాంటి వార్త తెలిసింది. గత సీజన్ లో సత్తా చాటిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల కారణంగా ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం అనమానంగా మారింది. వన్డేల్లో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్, ఆసీస్ స్టార్ పేసర్ అయిన్ జోస్ హాజిల్ వుడ్ మడమ సమస్య కారణంగా సీజన్ మొత్తానికే దూరమయ్యే ప్రమాదముండగా.. స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదర్ సైతం మడమ గాయం కారణంగానే సీజ్ ఆరంభ మ్యాచ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంది.

Also Read : Mission Bhagiratha water: భగీరథ పైపులైన్‌ లీక్‌.. వృధాగా పోతున్న తాగునీరు

గాయం కారణంగా ఇటీవలే భారత్ తో జరిగిన టెస్ట్, వన్డే సిరిస్ ల్లో కూడా పాల్గొనని హాజిల్ వుడ్, గాయం నుంచి వేగంగా కోలుకోని కనీసం సీజన్ సెకెండ్ లెగ్ మ్యాచ్ లకైనా అందుబాటులో ఉండాలని భావిస్తున్నాడు. ఒకవేళ హాజిల్ వుడ్ సీజన్ మొత్తానికే దూరమైతే.. ఆర్సీబీకి ఇది భారీ ఎదురుదెబ్బగా పరిగణించాలి.. 2022 మెగా వేలంలో హాజిల్ వుడ్ ఆర్సీబీ రూ. 7.75 కోట్లకు సొంతం చేసుకుంది.

Also Read : Apcc Deeksha:మోడీ హయాంలో సీబీఐ, ఈడీలు కీలుబొమ్మలు

మరోవైపు గత సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై సెంచరీ బాదిన ఆర్సీబీ హీరో రజత్ పాటిదార్.. గాయం కారణంగా ప్రస్తుతం ఎస్సీఏలోని రిహాబ్ లో చికిత్స పొందుతున్నాడు. ఐపీఎల్ 2023 లో ఆర్సీబీ ట్రయినింగ్ క్యాంప్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు గాయం బారిన పడ్డ పాటిదార్.. సీజన్ ఫస్ట్ హాఫ్ మ్యాచ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్సీఏ అధికారులు అతన్ని తదుపరి మూడు వారాలు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

Also Read : Rahul Gandhi: దటీజ్ రాహుల్.. డిస్ క్వాలిఫైడ్ ఎంపీ అంటూ ట్విట్టర్ అకౌంట్‌లో మార్పు

ఎంఆర్ఐ స్కాన్ అనంతరం పాటిదార్ పరిస్థితిని మరోసారి సమీక్షించి, అతను ఐపీఎల్-2023 సెకెండ్ లెగ్ లో పాల్గొనేది లేనిది తేలుస్తామని ఎన్సీఏ అధికారులు తెలిపారు. హాజిల్ వుడ్, పాటిదార్ లతో పాటు మరో స్టార్ ఆటగాడు మ్యాక్స్ వెల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని తెలుస్తోంది. మ్యాక్సీ కూడా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇదే నిజమైతే, త్వరలో ప్రారంభమయ్యే సీజన్ లోనూ ఆర్సీబీ వైఫల్యాల పరంపర కొనసాగే అవకాశం ఉంది. కాగా, ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ తో ఆర్సీబీ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.

Show comments