Mohan Babu Letter Goes Viral: ఏ పార్టీ వారైనా తన పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని ‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే దృష్టి పెట్టాలని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి అస్సలు లాగొద్దన్నారు. శాంతి, సౌభ్రాతృత్వాలను ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని మోహన్ బాబు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ లేఖ చేశారు.
‘ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా.. నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలి గాని.. సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని హెచ్చరించారు.
Also Read: Gaami Trailer: సరికొత్త ఫార్మాట్‌లో విశ్వక్ సేన్ ‘గామి’ ట్రైలర్.. ఇదే మొట్టమొదటిసారి!
ప్రస్తుతం మోహన్ బాబు చేసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మాజీ సీఎం ఎన్టీఆర్ హయాంలో టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా మోహన్ బాబు వ్యవహరించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి.. పార్టీకి మద్దతుగా ప్రచారం చేసారు. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత మోహన్ బాబుకు కీలక పదవి వస్తుందని అందరూ అంచనా వేసినా.. అది జరగలేదు. అనంతరం మోహన్ బాబు రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు.
విజ్ఞప్తి pic.twitter.com/kHnATpRdA5
— Mohan Babu M (@themohanbabu) February 26, 2024