Site icon NTV Telugu

Tea: ఛాయ్ తో పాటు బిస్కెట్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త

Tea

Tea

Don’t Eat Biscuits with tea: చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. యాక్టివ్ గా ఉండాలంటే టీ కచ్ఛితంగా తాగాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. నిద్రమత్తు వదలడానికి, బద్దకం పోవడానికి చాలా మంది టీ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది టీ తో పాటు బిస్కెట్లు కూడా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం శరీరానికి హాని చేయవచ్చు అంటున్నారు నిపుణులు. టీ తో పాటు బిస్కెట్లు తింటే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. టీతో పాటు బిస్కెట్లు తింటే.. బీపీ పెరుగతుందని, హైపర్‌టెన్షన్‌ సమస్య వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

Also Read: Chinese Hackers: అమెరికా ప్రభుత్వానికి చెందిన 60వేల ఈ మెయిల్స్ దొంగిలించిన చైనీస్ హ్యాకర్లు

ఈ అలవాటు డీఎన్ఏను కూడా దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి. హైపర్‌టెన్షన్‌ కు ప్రధాన కారణం సోడియం. బిస్కెట్లలో సోడియం కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ ముప్పును పెంచుతుంది. దీని వల్ల గుండెసమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బిస్కెట్లు ప్రాసెస్‌ చేసిన ఆహారం. శుద్ధి చేసిన ఆహార పదార్థాలు జీర్ణక్రియను పాడు చేస్తాయి. ఇవి మలబద్ధకానికి దారితీయవచ్చు. బిస్కెట్స్ లో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ ఉంటుంది. ఇది శరీరంలోని హార్మోన్ల బ్యాలెన్స్ ను దెబ్బతీస్తుంది. ఇక టీతో పాటు బిస్కెట్లు కూడా తింటే షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే టీలో, బిస్కెట్స్ రెండింటిలో షుగర్ ఉంటుంది. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. దీని వల్ల మధుమేహం పెరిగే అవకాశం ఉంది.

 

Exit mobile version