NTV Telugu Site icon

Health Tips : ఆ ఆరోగ్య సమస్య ఉంటే వంకాయ తినకండి.. విషంతో సమానం..!

Brinjal

Brinjal

కూరగాయలలో రారాజు వంకాయ.. వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు..? ఇది అందించే రుచి , ఆరోగ్య ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు.. ఇది ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు , శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థ : జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే లేదా జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటే.. మీరు వంకాయ తినకుండా ఉండాలి. ఎందుకంటే వంకాయ మీ జీర్ణశక్తిని పాడు చేస్తుంది.

అలెర్జీ సమస్య: మీకు చర్మంపై చికాకు , దురద ఉంటే, మీరు వంకాయను తినకూడదు. సాధారణంగా స్కిన్ ఎలర్జీ ఉంటే వంకాయను తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.. అది మీ సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది..

డిప్రెషన్ : డిప్రెషన్ లేదా యాంగ్జయిటీకి మాత్రలు వేసుకుంటున్నట్లయితే వంకాయ తినకండి.. అది మీ ఒత్తిడిని పెంచుతుంది. మాత్రల శక్తిని కూడా తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రక్తహీనత: రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు రక్తహీనత వస్తుంది. మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో, మీరు వంకాయను ఎక్కువగా తినకూడదు.

కంటి చికాకు: చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు వంకాయకు దూరంగా ఉండాలి. కంటి దురద, చికాకు, దృష్టి లోపం, కళ్ల చుట్టూ వాపు వంటి సమస్యలు ఉంటే వంకాయ తినకూడదు.

కిడ్నీ స్టోన్: కిడ్నీ స్టోన్ ఉన్నవారు వంకాయను ముట్టుకోకూడదు. వంకాయలోని ఆక్సలేట్లు మీ రాతి సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.