Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని నెలరోజుల క్రితమే సంకేతాలు ఇచ్చారు. 2024లో వైట్‌హౌస్ రేసులో మాజీ అధ్యక్షుడు దూకాలని భావిస్తున్నందున వచ్చే వారం తాను చాలా పెద్ద ప్రకటన చేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సోమవారం తెలిపారు.2020లో ఓడిపోయిన తన రీ-ఎలక్షన్ బిడ్‌ను ఎన్నడూ అంగీకరించని ట్రంప్, తాను మళ్లీ ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని నెలల తరబడి సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం ప్రకటన చేయబోతున్నారనే విషయంలో అమెరికా వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15 మంగళవారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో గల తన నివాసం మార్-ఎ-లాగోలో తాను చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నానని ట్రంప్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రట్స్ తనను మోసం చేసి గెలిచారని ఆరోపించిన ట్రంప్.. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇటీవల అయోవాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. 2020 ఎన్నికల సమయంలో జరిగిన మోసం వల్ల తాను పరాజయం పొందానని, ఈసారి కచ్చితంగా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను రెండుసార్లు పోటీ చేశానని చెప్పిన ఆయన.. 2020లో కంటే 2022లో ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
MP Navneet Rana: ఎంపీ నవనీత్ రాణాపై నాన్‌బెయిలబుల్ వారెంట్.. ఎందుకో తెలుసా?
ఈ నెలలోనే వైట్‌హౌస్ కోసం మూడో బిడ్‌ను బహుశా వేయవచ్చని చెప్పారు. అటు మాజీ అధ్యక్షుడి తాజా బిడ్‌ను పరిశీలిస్తున్నట్లు ముగ్గురు ట్రంప్ సలహాదారులు కూడా ధ్రువీకరించారు. ఇదిలాఉంటే.. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ అనుచరులు, మద్దతుదారులు ఎంతటి విధ్వంసం సృష్టించారో తెలిసిందే. ఏకంగా క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారు.
