Donald Trump: “నాకు ఇండియా అంటే ఇష్టం.. మోడీ నా బెస్ట్ ఫ్రెండ్”.. భారత్ ప్రజలకు ట్రంప్ స్పెషల్ మెసేజ్!

Moditrump

Moditrump

Donald Trump: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రేమ కురిపించారు. తాను మరోసారి భారత్‌కు రావాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీపై సైతం ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా భారత్‌కు చెందిన ఓ న్యూస్ ఛానెల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో ట్రంప్ అత్యంత సన్నిహితురాలు లౌరా లూమర్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. తాను కొద్దిసేపటి క్రితమే ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పిన ఆమె సందేశాన్ని చదివారు. భారత్‌పై తనకు ఎంతో ప్రేమ ఉందని, ముఖ్యంగా నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడని (I love India, love Modi) పేర్కొన్నారని తెలిపారు. “నాకు భారత్ అంటే చాలా ఇష్టం. దయచేసి భారత ప్రజలకు చెప్పండి.. నాకు మోడీపై కూడా ఎంతో అభిమానముంది. ఆయన గొప్ప నాయకుడు, అలాగే నా మంచి స్నేహితుడు. భారత ప్రజలకు నా ప్రేమను తెలియజేయండి. త్వరలోనే మరోసారి భారత్‌కు రావాలని భావిస్తున్నాను” అని ట్రంప్ చెప్పిన సందేశాన్ని లూమర్ వివరించారు.

READ MORE: చిన్నారుల భద్రత కోసం WhatsApp కొత్త ఫీచర్.. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ‘పేరెంట్ మేనేజ్‌డ్ అకౌంట్స్’ షురూ..!

ఇక లౌరా లూమర్ విషయానికి వస్తే.. ఆమె అమెరికాలో కట్టుదిట్టమైన రైడ్ వింగ్ భావాజాలం కలిగిన కార్యకర్తగా ప్రసిద్ధి చెందారు. తాను ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయ మద్దతుదారినని చెప్పుకుంటూ.. ట్రంప్ రెండో పదవీకాలంలో “loyalty enforcer”గా వ్యవహరిస్తున్నానని తెలిపారు. అంటే ట్రంప్ లేదా ఆయన విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారిపై సోషల్ మీడియాలో గట్టిగా స్పందించడం తన పాత్రలో భాగమని పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ వంటి అంశాలపై తీవ్ర వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే లూమర్, ట్రంప్ తరఫున వచ్చిన ఈ సందేశం ద్వారా అమెరికా-భారత్ సంబంధాలపై మరోసారి చర్చకు తెరలేపారు. ట్రంప్ మాటల్లో ప్రధాని మోడని “అద్భుత నాయకుడు, మంచి స్నేహితుడు”గా అభివర్ణించడం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.

READ MORE: Lucknow: దారుణం.. సిగరెట్‌తో కాల్చి, తలను గోడకు బాది 5 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి.!