Donald Trump: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌కు 80 ఏళ్లు నిండబోతున్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన ఈ వయసులో కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఓ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఆయన ఏమైంది, ప్రపంచం నుంచి ట్రంప్ ఏం దాచి పెట్టాలని చూస్తున్నారని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రంప్ చేతికి ఏమైందనేది వైరల్ అవుతోంది. ఇటీవల ట్రంప్ చేతిపై మందపాటి మేకప్ పొర కనిపించింది. దీంతో ఒక్కసారి ఆయన ఆరోగ్యంపై దేశ ప్రజలు, ముఖ్యంగా ట్రంప్ మద్దతుదారులు ఆందోళన చేందుతున్నారు. అసలు ట్రంప్‌కు ఏమైందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: IndiGo Flight: టెన్షన్.. టెన్షన్.. దారి మళ్లిన సీఎం ప్రయాణిస్తున్న విమానం..
చేతిపై ఫోకస్..
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ సమీపంలోని ఒక మ్యూజియంకు వెళ్లారు. అక్కడ ఆయన కుడి చేతిపై మందపాటి మేకప్ పొర కనిపించింది. ఎడమ చేతిపై ఇలాంటిది కనిపించలేదు. ట్రంప్ చేతిపై ఇలా కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన సమావేశంలో కూడా ట్రంప్ చేయి ఇలాంటి స్థితిలోనే కనిపించింది. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చూసిన తర్వాత ఆయన అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ చేతిపై మందపాటి మేకప్ పొర ఏర్పాటు చేయడానికి ఆయన బలంగా కరచాలనం చేయడం ప్రధాన కారణం అని తెలుస్తుంది.
వైట్ హౌస్ స్పందన ..
వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా ఓ జర్నలిస్టు ట్రంప్ చేతులపై పదేపదే వాపు, మేకప్ పొరల గురించి ఒక ప్రశ్న అడిగారు. దీనికి స్పందించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కోరలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఇటీవల ట్రంప్ తన పాదాలలో వాపు ఉందని ఫిర్యాదు చేసిన తర్వాత, వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. పరీక్షల్లో ఆయన సిరలను కూడా పరిశీలించామని చెప్పారు. కరచాలనం చేసేటప్పుడు పొట్టు లేదా గాయం అయ్యే ప్రమాదం ఉందని, కరచాలనం కారణంగా చర్మం దెబ్బతినడం సర్వసాధారణమని అన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడు ఆస్ప్రిన్ తీసుకుంటున్నారని చెప్పారు. పరీక్షల తర్వాత ఆయనకు ఎటువంటి తీవ్రమైన అనారోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు లేవని గుర్తించినట్లు తెలిపారు. దీర్ఘకాలిక సిరల లోపం కారణంగా ప్రెసిడెంట్ ట్రంప్ మోకాళ్లు ఉబ్బుతాయని, ఇది 70 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఒక సాధారణ వ్యాధి అని అన్నారు. ఈ సమస్యతో కాలు సిరల నుంచి గుండెకు రక్తం సరిగ్గా పంప్ కాదని, దీంతో మోకాళ్లలో వాపు, నొప్పి వస్తాయన్నారు.
అమెరికా చరిత్రలో అత్యంత ఆరోగ్యకరమైన అధ్యక్షులలో తాను ఒకరని డోనాల్డ్ ట్రంప్ నమ్ముతారు. ఆయన 78 ఏళ్ల వయసులో రెండవసారి దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్వరలో ఆయనకు 80 ఏళ్లు నిండబోతున్నాయి. అయితే వయస్సుతో పాటు, అతని ఉత్సాహం తగ్గడానికి బదులుగా నిరంతరం పెరుగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు.
READ ALSO: ISRO Gaganyaan mission: ఇస్రో సూపర్ సక్సెస్.. ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం
