Site icon NTV Telugu

Donald Trump: 5 నెలల్లో 5 యుద్ధాలు ఆపాను! భారత్-పాకిస్థాన్ సీజ్‌ఫైర్‌పై మరోసారి వ్యాఖ్య!

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సీజ్‌ఫైర్‌కి తనదే క్రెడిట్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే కాదు, గత ఐదు నెలల్లో తాను 5 యుద్ధాలను ఆపినట్టు ఆయన పేర్కొన్నాడు. అంతేకాకుండా ట్రంప్ మాట్లాడుతూ.. ఇది బైడెన్ యుద్ధం. దీనినుంచి బయటపడేందుకు మేము తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. గత ఐదు నెలల్లో ఐదు యుద్ధాలను నేను ఆపేశాను. నిజంగా చెప్పాలంటే, ఇది ఆరో యుద్ధం కావాలనుకుంటున్నానని అన్నారు. తాను ఆపిన యుద్ధాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య సీజ్‌ఫైర్ కూడా ఉందని పేర్కొన్నారు. మీరు యుద్ధం చేస్తే మేము మీతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేయమని వారికి చెప్పానని వ్యాఖ్యానించాడు. దానితో వారు యుద్ధం ఆపేశారని అన్నారు.

HYD Mudra Cheater: ముద్ర లోన్స్‌ పేరుతో 500 మంది మహిళలను మోసం.. రూ. 3 కోట్లతో పరార్‌

అంతేకాకుండా ట్రంప్ తన ప్రకటనలో తైలాండ్-కాంబోడియా, కాంగో-రవాండా మధ్య జరిగిన గొడవలను కూడా తాను ఆపినట్టు పేర్కొన్నారు. ఈ గొడవలు కూడా వాణిజ్య ఒప్పందాల బెదిరింపులతో పరిష్కరించానని ఆయన తెలిపారు. మరోవైపు, వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లెవిట్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని తెలిపారు. ట్రంప్ కూడా గతంలో.. ప్రతి నెలా ఒక యుద్ధం ఆపినట్టు ఉంది. మేము లక్షల మందిని బతికించాం.. అంటూ పేర్కొన్నాడు.

Vijayasai Reddy: మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..? నిజమెంతా..?

ఇది ఇలా ఉండగా.. భారత్ ఇప్పటికే అమెరికా పాత్రపై స్పష్టతనిచ్చింది. మే 10 తర్వాత ట్రంప్ పలు మార్లు సీజ్‌ఫైర్ విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం జరిపినట్లు పేర్కొన్నప్పటికీ, భారత అధికారులు దీన్ని ఖండించారు. ప్రధానమంత్రి మోడీ కూడా పార్లమెంటులో మాట్లాడుతూ భారత్‌ను ఆపమని ఎవరూ కోరలేదన్నారు. అలాగే భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ కూడా సీజ్‌ఫైర్‌లో ఎలాంటి మూడవ వ్యక్తి పాత్ర లేదని స్పందించారు. ‘అంతేకాకుండా.. సీజ్‌ఫైర్ – వాణిజ్య ఒప్పందాలకు సంబంధం లేదని తెలిపారు.

Exit mobile version