NTV Telugu Site icon

Health Tips : దగ్గినా.. తుమ్మినా మూత్రం పడుతుందా.. ఇలా చేస్తే సమస్య దూరం

New Project (52)

New Project (52)

Health Tips : చాలా మందికి దగ్గనప్పుడు గానీ.. లేదా తుమ్మినప్పుడు కానీ మూత్రం లీక్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య చాలా మంది మహిళల్లో సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో గర్భం ..కటి ప్రాంతం.. చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కాస్త ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా 90 శాతం మంది మహిళలు ఈ యూరిన్ లీకేజీ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం బిడ్డ పుట్టగానే పెల్విక్ ప్రాంతం విస్తరిస్తుంది..ఒత్తిడిని తట్టుకోలేరు. బిడ్డ పుట్టిన తర్వాత, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

Read Also:USA vs IND: నేడు అమెరికాతో మ్యాచ్.. హ్యాట్రిక్‌పై భారత్‌ గురి!

అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒక్క చిట్కా పాటించండి. మీకు సమయం దొరికినప్పుడల్లా ప్రతిరోజూ హీలింగ్ ఎక్సర్‌సైజులు చేస్తే నెలరోజుల్లోనే మీ సమస్య తీరిపోతుంది. వైద్యులు చెప్పేది కూడా ఇదే. అదేవిధంగా మూత్రం వెళ్లే భాగాన్ని.. మోషన్ వెళ్లే భాగాన్ని ఒక్క నిమిషం లేదా 30 సెకన్ల పాటు.. మీరు ఎన్ని నిమిషాలు అలా బిగ పెట్టగలిగితే అన్ని నిమిషాలు చేయగలిగితే మీకు ఈ యూరిన్ లీకేజ్ సమస్య తగ్గిపోతుంది.

Read Also:India China Conflict: చైనాకు మోడీ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్.. టిబెట్‌లోని 30 ప్రాంతాల పేర్లు మార్పు..?

అంతేకాదు బ్రీత్ ఇన్.. బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఈ యూరిన్ లీకేజీ సమస్య తగ్గుతుంది అంటున్నారు డాక్టర్లు. మరీ ముఖ్యంగా, కొంతమంది మహిళలు ఈ సమస్యను డాక్టర్‌తో చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. కానీ అలా సిగ్గుపడుతూ ఉంటే మన ఆరోగ్య సమస్య తీరదు.. ఏ విషయం అయినా డాక్టర్‌కి ముక్తసరిగా చెప్పాలి.. ఈ హీలింగ్ ఎక్సర్‌సైజ్‌ని రోజుకు 10 సార్లు చేయడం ద్వారా మహిళలు నెల రోజుల్లోనే యూరిన్ లీకేజీ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. .!!