NTV Telugu Site icon

Kidney Stones : కాఫీ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయి..?

Coffee

Coffee

మన శరీరంలోని కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు ముఖ్యమైనవి. రక్తం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు, శరీరంలోని ద్రవ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని వ్యర్థ పదార్థాల నుంచి తయారు చేయబడిన చిన్న, గట్టి పదార్థం. ఇది బయటకు రాకుండా కిడ్నీల్లోనే రాళ్లుగా ఉండిపోతాయి. తక్కువ మోతాదులో నీరు సేవించే వారిలో కిడ్నిల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

Read Also : Balakrishna: తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్.టి.ఆర్.!

మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించేందుకు పరిశోధకులు అనేక అధ్యయనాలు చేస్తున్నారు. అయితే కాఫీ తాగడానికి, మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుంచి బయటపడటానికి మధ్య సంబంధాన్ని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇటీవలి అధ్యయనాల్లో కెఫీన్ వినియోగం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చని తేలింది. చాలా మంది తరచుగా కాఫీ తాగడం వల్ల డీహైడ్రేట్ కు కావాల్సి వస్తుందని.. తద్వారా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం పెరుగుతుందని భావిస్తారు. అయితే అది పూర్తిగా అవాస్తవమని ఈ అధ్యయనం ద్వారా తేలింది.

Read Also : Bollywood: రామ్ చరణ్ ఎంట్రీకి రిపీట్స్ పడాల్సిందే… లుక్ ఇరగదీసాడు

వాస్తవానికి కిడ్నిలో రాళ్లపై పరిశోధనలు కెఫీన్ వాడకం వల్ల కిడ్నీలో రాళ్లు రాకుండా అడ్డుకుంటుందని తేల్చాయి. రోజుకు 1 కప్పు నుంచి రెండు కప్పుల వరకు కాఫీ తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల సమస్య 40శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ కలిగిని ద్రవాలు తాగని వారి కంటే కాఫీ లేదా టీ తాగే వారికి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించారు. నీరు మూత్ర ప్రవాహాన్ని పెంచడం వల్ల కిడ్నీల్లోని రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మొత్తానికి కాఫీ అనేది మూత్రపిండాల్లో రాళ్ల నుంచి రక్షణ కల్పించడానికి దోహదపడుతుంది.