వైద్యులను దైవంతో సమానంగా భావిస్తుంటారు. కానీ కొందరు వైద్యుల తీరు వైద్య వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. కొందరు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. జ్వరం చికిత్స కోసం వస్తే… కుక్క కాటుకు ఇచ్చే రేబీస్ టీకా వేశారు వైద్య సిబ్బంది. దేవరకద్ర పీ హెచ్ సి లో ఘటన చోటుచేసుకుంది. బల్సుపల్లి గ్రామానికి చెందిన నాగరాజు జ్వరంతో శనివారం దేవరకద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు.
Also Read:Deputy CM Pawan: హ్యాపీ బర్త్‌డే మోడీజీ.. మీ నాయకత్వంలో దేశం అగ్రగామిగా..!
పరీక్షించిన వైద్యులు మూడు రోజుల పాటు ఇంజెక్షన్‌లు తీసుకోవాలని చీటీ రాసిచ్చారు. మొదటి రోజు జ్వరం ఇంజెక్షన్ ఇవ్వగా.. రెండోరోజు మంగళవారం ఏఎన్‌ఎం రేబిస్ టీకా ఇచ్చారు. అనంతరం ఆ ఏఎన్‌ఎం జరిగిన పొరపాటును బాధితుడికి చెప్పింది. అతడు వెంటనే వైద్యులను సంప్రదించి నిలదీశారు. ఆసుపత్రివైద్యుడు శరత్ మాట్లాడుతూ నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బల్సుపల్లికి చెందిన నాగరాజు ను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు.
