NTV Telugu Site icon

Whatsapp: గర్భిణీకి పురిటి నొప్పులు.. వాట్సాప్ సాయంతో డెలివరీ

Whatsapp

Whatsapp

Whatsapp: సరదాగా ఛాటింగ్ చేసుకునే వాట్సాప్ తాను అప్పుడప్పుడు మంచికి కూడా ఉపయోగపడతానని నిరూపించింది. జమ్మూకశ్మీర్‌లోని హిమపాతం కారణంగా ఆ ప్రాంతానికి అధునాతనమైన వైద్య సదుపాయాలు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో వాట్సాప్‌ కాల్‌ ద్వారా గర్భిణీ ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించడంలో వైద్యులు సహాయం చేశారు. శుక్రవారం రాత్రి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రసవ వేదనతో అల్లాడుతున్న గర్భిణీని తాము ఆదుకున్నామని క్రాల్‌పోరా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మీర్ మహ్మద్ షఫీ తెలిపారు. శీతాకాలంలో కుప్వారా జిల్లాలో చాలా ప్రాంతాల్లో ప్రసూతి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ అవసరం. కేరాన్‌ పీహెచ్‌సీలో ఈ సీరియస్‌ కేసును వైద్యులు వాట్సాప్‌ వీడియో కాల్‌లో సీనియర్‌ వైద్యుల సలహాలతో విజయవంతంగా పూర్తి చేశారు.

UK Drug Lord: మోస్ట్‌ వాంటెడ్‌, బ్రిటీష్‌ క్రైమ్‌ బాస్‌.. ఎట్టకేలకు థాయ్‌లాండ్‌లో అరెస్ట్‌

గురువారం, శుక్రవారాల్లో నిరంతరంగా కురుస్తున్న హిమపాతం వల్ల అధికారులు హెలికాప్టర్‌ ఏర్పాటు చేసి తరలింపును ఏర్పాటు చేయడాన్ని నిరోధించారు. కేరాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య సిబ్బంది డెలివరీలో సహాయం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతకవలసి వచ్చింది. క్రాల్‌పోరా సబ్‌డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్, డాక్టర్ పర్వేజ్, డాక్టర్ అర్షద్ సోఫీ, అతని పారామెడికల్ సిబ్బందికి కేరాన్ పీహెచ్‌సిలో శిశువును ప్రసవించే ప్రక్రియపై వాట్సాప్ కాల్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. వాట్సాప్‌లో సీనియర్ వైద్యుల సలహాలు పాటించి ఆ మహిళకు విజయవంతంగా పురుడుపోశారు. సుమారు ఆరు గంటల పాటు వైద్యులు శ్రమించిన తర్వాత ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం శిశువు మరియు తల్లి ఇద్దరూ పరిశీలనలో ఉన్నారు. ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్‌ షఫీ వెల్లడించారు.

Show comments