ప్రముఖ మాసపత్రిక ప్రజా డైరీ ప్రతిఏటా అందజేస్తున్న ఉత్తమ వైద్యుల అవార్డుల ప్రధానోత్సవం లో భాగంగా సోమవారం హాస్పిటల్స్ ఎండి ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా. వి కొప్పాలకు తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ అలీ అవార్డు అందజేశారు. ఇక్కడి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు .ఈ సందర్భంగా హోం మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ వేస్కులర్ విభాగంలో ఉత్తమ వైద్య సేవలు అందించే ఏవిస్ హాస్పిటల్ కు, హాస్పిటల్ ఎండి రాజాకు ఈ అవార్డు అందజేయడం అభినందనీయమన్నారు ఎవిస్ హాస్పిటల్స్ మరిన్ని శాఖలతో విస్తరించి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అభిలషించారు .ఈ కార్యక్రమంలో ప్రజా డైరీ ఎడిటర్ వి సురేష్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు
Doctor Raja : ఏవీఎస్ ఎండి డాక్టర్ రాజాకు ప్రజా డైరీ అవార్డు

Doctor Raja