NTV Telugu Site icon

Phone Addict: ఫోన్ చూసి చూసి కళ్ళు పోగొట్టుకున్న హైదరాబాదీ మహిళ

Woman

Woman

Phone Addict: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారారు. ఎంతలా అంటే అవి వారి జీవితంలో భాగం. ఫోన్ లేకుండా రోజు గడవదు. అన్ని పనులూ స్మార్ట్ ఫోన్ నుంచే చేసేవిధంగా టెక్నాలజీ మారింది. తాజాగా గంటలకొద్ది స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల కంటి చూపు కూడా పోతోందని తేలింది. హైదరాబాద్‌కు చెందిన మంజు అనే 30 ఏళ్ల మహిళ తన చూపు తగ్గిపోతోందని వైద్యుల దగ్గరకు వెళ్లింది. టెస్టులు చేసిన వైద్యులు అసలు సమస్య అంతా స్మార్ట్ ఫోన్ ను గంటల తరబడి చూడటం వల్లే వచ్చిందని గుర్తించారు. చీకటిలో ఫోన్ ను అదే పనిగా చూస్తూ కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకుంది ఆ మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ ట్విట్టర్ లో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మంజు అనే మహిళ ప్రతిరోజు రాత్రిళ్లు చీకటి గదిలో చాలా సేపు స్మార్ట్ ఫోన్ చూస్తూ గడిపారు. దీనివల్ల ఆమె దాదాపు ఏడాదిన్నర కాలంగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వస్తువులను సరిగ్గా చూడలేని స్థితికి ప్రస్తుతం ఆమె కళ్లు చేరుకున్నాయి. కంటి వైద్యుడి వద్దకు వెళ్లినా లాభం లేకుండాపోయింది.

Read Also: Jagananna Gorumudda: పిల్లలకు గుడ్‌న్యూస్‌.. జగనన్న గోరుముద్దలో చేరిన మరో పోషకాహారం.

న్యూరాలజిస్ట్ వద్దకు వెళ్లాలని కంటి వైద్యుడు ఆమెకు సూచించారు. దీంతో ఆమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి, స్టార్ట్ ఫోన్ విజన్ సిండ్రమ్ (SVS)గా న్యూరాలజిస్ట్ నిర్ధారించారు. ఈ సిండ్రమ్ ఉంటే కంటి సంబంధిత సమస్యలు రావడమే కాకుండా అంధులుగా మారే ప్రమాదమూ ఉంటుంది. మంజుకి ఉన్న అలవాట్లు, ఆమె పని వంటి పలు విషయాలను వైద్యుడు తెలుసుకున్నారు. ఫోన్ చూడడం తగ్గించుకోమని.. కొన్ని మందులు రాసిచ్చారు. ఆ రెండింటినీ పాటించాక మంజు కంటి చూపు మెరుగుపడింది. 18 నెలలుగా ఆమె పడుతున్న బాధ నుంచి విముక్తి పొందారు. మొబైల్ ను గంటల కొద్దీ చూస్తుండడం వల్లే ఆమె కంటిలో సమస్య ఏర్పడిందన్న తమ అంచనా నిజమేనని నిర్ధారణ అయిందని వైద్యుడు చెప్పారు. మొబైల్ ఫోన్లను అధికంగా వాడే వారు కంటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Show comments