Site icon NTV Telugu

Fraud: కొందరు తమ భాగస్వాములను ఎందుకు మోసం చేస్తారో తెలుసా..!

Fraud

Fraud

భార్య-భర్త, ప్రియురాలు-ప్రియుడు అనే బంధాలు.. ప్రేమ, గౌరవం అనే సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి వారి మధ్య నమ్మకం కోల్పోతే.. మళ్లీ భాగస్వామి మనసు గెలుచుకోవడం అంత సులువు కాదు. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వంటి వాటితో కనెక్టివిటీ చాలా మారింది. అందుకే ప్రజలు ఒకరినొకరు సులభంగా మోసం చేసుకుంటున్నారు. అయితే మోసం చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని మీకు తెలుసా.

NDA Meet: ప్రధాని మోడీ సమక్షంలో 38 పార్టీలతో ఎన్డీయే కూటమి భేటీ

ప్రతీకార భావన
కొన్నిసార్లు జంటల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఒకరిపై ఒకరు ప్రతీకారం తీర్చుకోవాలనే భావన వస్తుంది. దీంతో తమ భాగస్వామిని మోసం చేయాలనే ఆలోచన వస్తుంది. మరికొందరిలో తమ భాగస్వామిపై అనుమానం అనేది మోసం చేసేలా తయారు చేస్తుంది.

పట్టించుకోకపోవడం
తన జీవిత భాగస్వామిని పట్టించుకోకుండా ఉంటే.. దాని ప్రతికూలత కొత్త భాగస్వామి కోసం వెతుకుంటారు. తమను పట్టించుకోకపోవడం అనేది మనస్సులో ఏదో ప్రతికూలతను సృష్టిస్తుంది. దీంతో మోసం అనే ఆలోచన వచ్చి.. ప్రతీకారంతో తాను అనుకున్నది సాధిస్తారు.

NTR: అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే.. నెక్స్ట్ సీఎం ఎన్టీఆరే

సంబంధం ముగించడం
పాత సంబంధానికి స్వస్తి చెప్పాలనే కోరిక భాగస్వామి మనసులో వస్తే.. వారు ఎలాగైనా చేసి విడిపోవాలని చూస్తారు. అందుకు కొందరు ఏం చేస్తారంటే.. మరొకరితో ఫ్రెండ్లీగా ఉండటం, అతని జీవితంలోకి ప్రవేశించడం లాంటివి చేస్తారు. ఈ విషయాలు తన పాత భాగస్వామికి తెలిస్తే.. సంబంధం విచ్ఛిన్నమవుతుంది.

మానసికంగా కలిసి ఉండాలి
ఏదైనా రిలేషన్ షిప్ లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మానసికంగా కలిసి ఉండాలి. లేదంటే ఒకే ఇంట్లో కలిసి ఉన్న.. లాభమేమీ లేదు. లేదంటే మోసం చేయాలనే ఆలోచన ఇద్దరిలో ఎవరికైనా వచ్చి.. వారి బంధం ముగుస్తుంది.

Exit mobile version