NTV Telugu Site icon

Prabhas : ప్రభాస్ చెప్పిన సర్ప్రైజింగ్ పర్సన్ ఎవరో తెలుసా..?

Whatsapp Image 2024 05 18 At 10.13.19 Am

Whatsapp Image 2024 05 18 At 10.13.19 Am

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది.సలార్ సినిమా ఇచ్చిన జోష్ లో ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టాడు.ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ నటిస్తున్నారు.

ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.అయితే ఇటీవల ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్‌, ఫైనల్‌గా ఒక ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్‌లోకి రాబోతున్నారు. వెయిట్ చేయండి అంటూ  పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూసారు. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ వుంటుందట . దాని పేరు బుజ్జి అని తెలుస్తుంది.ఆ బుజ్జిని  నేడు సాయంత్రం 5 గంటలకు పరిచయం చేయనున్నట్లు మేకర్స్ తెలియజేశారు. మరి ఆ సర్ప్రైజింగ్ బుజ్జి ఎలా ఉంటుందో తెలియాలి అంటే సాయంత్రం వరకు ఎదురు చూడాల్సిందే.