NTV Telugu Site icon

Mr. Bachchan: ప్రముఖ సంస్థకు ‘మిస్టర్ బచ్చన్’ ఆడియో రైట్స్!

Mr

Mr

మాస్ మహారాజ రవితేజ హీరోగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ కావడంతో బచ్చన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది.

ఇటీవల బచ్చన్ చిత్రం తాలుకు పాటలకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు పోస్టర్ వదిలింది పీపుల్స్ మీడియా. ఈ చిత్రం నుండి 8న సితార్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నటు మరో ప్రకటన చేసారు. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. బాలీవుడ్ ప్రముఖ సంస్థ అయినటువంటి ‘T – సీరిస్’ బచ్చన్ ఆడియో రైట్స్ దక్కించుకున్నట్టు నిర్మాణ సంస్థ అధికారక ప్రకటన చేసింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు మిస్టర్ బచ్చన్ నాన్ థియేటర్ రైట్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు రేసులో ఉన్నాయి. రవితేజ హీరోగా, పీపుల్స్ మీడియా కలయికలో వచ్చిన ధమాకా అటు థియేటర్లతో పాటు ఓటీటీలోను విజవంతం అయింది. ఓటీటీలో రవితేజ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండడంతో ఓటీటీ సంస్థల మధ్య పోటీ నెలకొంది . ఓటీటీ డీల్ క్లోజ్ అయితే థియేట్రికల్ బేరాలు మొదలెట్టనున్నారు నిర్మాతలు. ఆంధ్రాలో థియేటర్ల చైన్ నడిపే నిర్మాణ సంస్థతో కలిపి నైజాంలో అత్యధిక థియేటర్లు గుప్పిట్లో ఉన్న ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్టాల హక్కుల కోసం బేరాలు మొదలుపెట్టారు. దాదాపుగా డీల్ క్లోజ్ అయినట్టేనని వినిపిస్తోంది. థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అయితే ఆగస్టు 15న విడుదలకు అఫీషియల్ గా డేట్ ప్రకటించనుంది నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా.

Show comments