NTV Telugu Site icon

Car Safety: కారులో ఉండే బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ఏంటో తెలుసా..? ఉపయోగాలేంటి

Car

Car

కారులో ఎన్నో రకాలైన ముఖ్యమైన పరికరాలు ఉంటాయి.. అవి కారుకు చాలా ముఖ్యం. వాటితో పాటు.. కారుకు ముఖ్యమై దానిలో బ్రేకింగ్ సిస్టమ్ ఒకటి. బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా లేకుంటే సురక్షితమైన ప్రయాణాన్ని చేయలేము. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అన్ని కార్లలో బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ అందుబాటులో ఉంది. బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ అంటే ఏమిటి.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

Credit card: క్రెడిట్ కార్డులను క్లోజ్‌ చేసుకోవాలా.. ఆర్బీఐ రూల్స్‌ తెలుసా..?

బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ అంటే ఏమిటి?
ఏ వాహనంలోనైనా బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ఉంటే.. అది వాహనం యొక్క బ్రేకింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ సదుపాయం కలిగి ఉండటం వల్ల ప్రయాణాన్ని చాలా వరకు సురక్షితం చేస్తుంది. బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ అత్యవసర పరిస్థితుల్లో పని చేస్తుంది. దీని వల్ల వాహనాన్ని అకస్మాత్తుగా ఆపివేయడం వల్ల చాలా పెద్ద ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ వర్తించిన వెంటనే.. వాహనం యొక్క చక్రాలు ఆగిపోతాయి. అంతేకాకుండా.. వాహనం యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉండేలా వాహనం బోల్తా పడకుండా.. ఏ ఇతర వాహనాన్ని ఢీకొనకుండా ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ విధంగా వాహనం యొక్క భద్రతను పెంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ABS బ్రేక్ అసిస్ట్ అధునాతన వెర్షన్
వాహన కంపెనీలు కార్లలో యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్ అంటే (ABS) టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఏబీఎస్ ఫీచర్ లేకుండా వాహనం నడపడం నేటి కాలంలో చాలా కష్టమైన పనిగా మారింది. దీని వినియోగం గత ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఈ ఫీచర్ ఇప్పుడు ప్రతి కారు భద్రతకు అవసరమైనదిగా మారింది. అయితే, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్.. ఏబీఎస్ రెండూ భిన్నంగా ఉంటాయి.

బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
బ్రేక్ అసిస్ట్ సిస్టమ్.. ఏబీఎస్ యొక్క అధునాతన వెర్షన్. అంటే బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ఏబీఎస్ కంటే మెరుగైనది, సమర్థవంతమైనది. ఏబీఎస్ ని ఉపయోగించే వాహనాల్లో బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ అనేది సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండి.. వాహనం యొక్క బ్రేక్‌లు తొందర్లో పడతాయి. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లను వేసినప్పుడు బ్రేక్ అసిస్ట్ సిస్టమ్ పనిచేస్తుంది. అంతేకాకుండా.. వాహనం యొక్క వేగం తక్కువగా ఉండి.. తరచుగా బ్రేకులు ఉపయోగిస్తుంటే ఈ వ్యవస్థ పనిచేయదు.