NTV Telugu Site icon

Rashmika Mandanna : రష్మిక మందన్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Rashmika (2)

Rashmika (2)

రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. చలో నుంచి పుష్ప సినిమా వరకు తన సినీ ప్రయాణం గురించి అందరికీ తెలుసు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలలో పుష్ప సినిమా ఎక్కువ క్రేజ్ ను అందించింది.. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమాతో నేషనల్ క్రష్ అయ్యింది.. తెలుగు పాటు, బాలీవుడ్ లో కూడా సత్తాను చాటుతుంది.. ఇక ఈరోజు రష్మిక మందన్న పుట్టినరోజు..నేడు ఆమె తన 28 వ పుట్టినరోజును జరుపుకుంటుంది.. రష్మిక గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..

రష్మిక కర్ణాటకకు చెందిన అమ్మాయి.. విద్యాభ్యాసం మొత్తం అక్కడే పూర్తి చేసింది.. చిన్నప్పటి నుంచి నటన పై ఇంట్రెస్ట్ ఉండటంతో అమ్మడు అటువైపు అడుగులు వేసింది.. మొదట మోడలింగ్‌ షోలలో పనిచేసింది. అలా ఒక షోలో ఆమెను చూసిన రక్షిత్‌ శెట్టి ‘కిరిక్‌ పార్టీ’ సినిమాలో ఎలాంటి ఆడిషన్‌ లేకుండానే ఛాన్స్‌ ఇచ్చాడు.. తమ కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.. అయితే రష్మిక మొదటి రెమ్యూనరేషన్ గురించి చాలా మందికి తెలియదు.. కిర్రాక్ పార్టీ సినిమాకు ఆమెకు రూ.1 లక్షా 50 వేలు అందుకుంది..

ఇక ఆ తర్వాత వచ్చిన ఛలో సినిమాకు రూ. 50 లక్షలు అందుకున్నారని టాక్‌.. కొలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది… ఇప్పుడు ఒక్కో సినిమాకు 5 నుంచి 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది.. ప్రస్తుతం తెలుగు పుష్ప 2 సినిమాతో పాటుగా రెండు సినిమాల్లో నటిస్తుంది.. బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది..

Show comments