NTV Telugu Site icon

IPL: ఐపీఎల్‌ హిస్టరీలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన క్రికెటర్లు తెలుసా..?

Ipl Fastest Fifty

Ipl Fastest Fifty

ఐపీఎల్ అంటేనే పరుగుల సునామీ. ఒక్క బాల్‌ను వేస్ట్ చేసినా.. బ్యాటర్లు బాధపడిపోతుంటారు. ప్రతీ బాల్ బౌండరీ, సిక్సర్ కొట్టడమే బ్యాటర్ లక్ష్యం. అయితే.. ఐపీఎల్ చరిత్రలోనే కొందరు ఆటగాళ్లు తమ దూకుడు ఆటతో వేగంగా అర్థ సెంచరీ సాధించిన ఆటగాళ్లు ఉన్నారో.. వారెవరో ఒకసారి లుక్కేద్దాం.

Read Also: Boianapalli Vinod Kumar: రజతోత్సవ సభ.. కొత్త తరానికి కొత్త ఆలోచనలు..!

ట్రావిస్ హెడ్
ట్రావిస్ హెడ్ 2024 ఐపీఎల్ సీజన్‌లో సునామీలా బ్యాటింగ్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై 16 బంతుల్లో రెండు సార్లు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది అతని అద్భుతమైన ఫామ్‌కు నిదర్శనం. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును ట్రావిస్ హెడ్ తన ఖాతాలో వేసుకున్నాడు.

నికోలస్ పూరన్
నికోలస్ పూరన్ (2023) – లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆర్‌సీబీ పై 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు.

జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్
జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (2024) – ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 2024 సీజన్‌లో 15 బంతుల్లో రెండు సార్లు అర్ధ సెంచరీ చేశాడు.

సునీల్ నరైన్
సునీల్ నరైన్ (2017) – కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.

యూసుఫ్ పఠాన్
యూసుఫ్ పఠాన్ (2014) – సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఆల్‌రౌండర్‌గా తన సత్తా చాటాడు.

పాట్ కమ్మిన్స్
పాట్ కమ్మిన్స్ ఒక ఫాస్ట్ బౌలర్ అయినప్పటికీ.. బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. పాట్ కమ్మిన్స్ (2022) – కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ముంబై ఇండియన్స్ పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి 14 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు.

కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ (2018) – పంజాబ్ కింగ్స్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్ పై 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.

యశస్వి జైస్వాల్
ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన రికార్డు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ పేరిట ఉంది. 2023 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఇన్నింగ్స్‌తో యశస్వి తన దూకుడు బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.