NTV Telugu Site icon

Dunki : షారుఖ్‌ఖాన్‌ డంకీ బడ్జెట్‌ ఎంతో తెలుసా..?

Whatsapp Image 2023 11 22 At 10.32.22 Pm

Whatsapp Image 2023 11 22 At 10.32.22 Pm

బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌ రీసెంట్ గా జవాన్ సినిమా తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.. సౌత్ స్టార్ డైరెక్టర్ అయిన అట్లీ జవాన్ సినిమా ను తెరకెక్కించించి బాలీవుడ్ లో కూడా అదిరిపోయే హిట్ అందుకున్నాడు..జవాన్ సినిమా లో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించారు. జవాన్ సినిమా దాదాపు 1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ సాధించింది. గతంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు..ప్రస్తుతం షారుఖ్ ఖాన్ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం డంకీ. ఈ సినిమా కు సంబంధించి ఓ వార్త బీటౌన్‌ సర్కిల్‌ లో తెగ వైరల్ అవుతుంది.ఈ చిత్రానికి మేకర్స్‌ కేవలం రూ.80 కోట్ల బడ్జెట్ మాత్రమే బడ్జెట్ పెట్టినట్లు సమాచారం..

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమా కు ఇంత తక్కువ బడ్జెట్ వెచ్చించడటం అనే వార్త ఇప్పడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.డంకీ చిత్రం లో ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను హీరోయిన్ గా నటిస్తుండగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్‌ మరియు అనిల్ గ్రోవర్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే డంకి డ్రాప్ 1 రూపం లో ఫస్ట్ వీడియో అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్లు మేకర్స్ రిలీజ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. డంకి డ్రాప్ 2 రూపం లో డంకీ ఫస్ట్ సింగిల్‌ లట్ పుట్ గయా సాంగ్‌ను విడుదల చేసారు. ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు జియో స్టూడియో బ్యానర్ల పై రాజ్‌కుమార్ హిరానీ మరియు గౌరీ ఖాన్‌ సంయుక్తం గా నిర్మిస్తున్నారు. డంకీ సినిమా డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా థియేటరల్లో విడుదల కానుంది.