Site icon NTV Telugu

Health Tips: చలికాలంలో శెనగ సత్తు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..!

Sattu

Sattu

వింటర్ సీజన్ వచ్చేసరికి ఆహారంలో మార్పులు జరుగుతాయి. చలి కాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారాన్ని తినాలి. ఇలాంటి పరిస్థితిల్లో శెనగ సత్తు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో ఎంతో మేలు చేసే సత్తులో ఇలాంటి గుణాలు చాలా ఉన్నాయి. ఇది ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరమైన ఫైబర్ కూడా అందిస్తుంది. చలికాలంలో శెనగపప్పు సత్తు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.

Rahul Gandhi: బీజేపీ రైతుల రుణాలని మాఫీ చేయదు..కానీ అదానీ రుణాలను మాఫీ చేస్తుంది..

సత్తులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి
శెనగపప్పులో అధిక పోషకాహారం ఉంటుంది. శనగపప్పును ఎండబెట్టి కాల్చినందున అందులో ఉండే పోషకాలన్నీ చెక్కుచెదరకుండా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు సత్తులో లభిస్తాయి. ఇది ప్రోటీన్ యొక్క మంచి మూలం, అంతేకాకుండా.. శరీరానికి శక్తిని అందించే పవర్‌హౌస్ అని కూడా పిలుస్తారు. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం.. అది సత్తులో కలిగి ఉంటుంది. అంతేకాకుండా.. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువును తగ్గిస్తుంది
ప్రస్తుతం ఊబకాయం అనేది సాధారణ సమస్యగా మారింది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. పెరుగుతున్న జీవనశైలి కారణంగా, ప్రజలు అధిక బరువుకు గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గడానికి సరైన ఆహారం చాలా ముఖ్యం. శెనగ సత్తు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది తక్కువ కేలరీలు.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం కాబట్టి ఇది బరువు నియంత్రణకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
శెనగ సత్తు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. సత్తులో కార్బోహైడ్రేట్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. దానివల్ల అది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉండవు. అలాగే సత్తులో ఉండే అధిక పీచు పదార్థం రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. మధుమేహ రోగులకు ఇది తింటే చాలా మంచిది.

Exit mobile version