Site icon NTV Telugu

Razakar : రజాకార్ మూవీ డైరెక్టర్ ఓ యాంకర్ భర్త అని తెలుసా?

Razajkar Deirector

Razajkar Deirector

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అవుతున్న మూవీ రజాకార్.. ఈ సినిమా తెలంగాణా చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.. విడుదలకు ముందే ఎన్నో వివాదాలను అందుకున్న ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది.. ఈ సినిమా కథకు జనాలు ఫిదా అయ్యారు.. మొదటి షోతోనే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. ఈ సినిమా డైరెక్టర్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది..

నిజాం పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు.. కొన్ని వర్గాల వారికి సినిమా నచ్చక పోయిన చాలా మంది ప్రజలు ఈ సినిమాకు బ్రాహ్మరథం పడుతున్నారు.. ఇకపోతే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ఈ సినిమా డైరెక్టర్ యాట సత్యనారాయణ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది..

ఈయన సినిమాలు చెయ్యక ముందు సీరియల్స్ కు డైరెక్టర్ గా వ్యవహారించారు.. అయితే ఈయన రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో రాజమౌళి కూడా అక్కడే వర్క్ చేశారట. అలాగే హీరో నాని కూడా తనకు తెలుసని, కానీ నాని స్టార్ హీరో అయ్యాక మాట్లాడలేదని చెప్పాడు.. అయితే ఈయన ఓ స్టార్ యాంకర్ భర్త కూడా.. యాంకర్ మాత్రమే కాదు, సీరియల్స్ నటి కూడా.. ఆమె ఎవరో కాదు నవీన..సీరియల్స్ లో చేసే సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం పెళ్ళి వరకు వెళ్లిందట.. ఇక ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది.. నటి శ్రీవాణి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంటారు..

Exit mobile version