Site icon NTV Telugu

Shreya Goshal: వామ్మో.. ఒక్కపాటకు శ్రేయా ఘోషల్ అన్ని లక్షలు తీసుకుంటుందా?

Shreyaaa

Shreyaaa

శ్రేయా ఘోషల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్స్ లలో ఈమె కూడా ఒకరు.. అతి చిన్న వయస్సులో సింగర్ గా ఎన్నో సినిమాలకు పాడింది.. దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడింది.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాళీ ఇలా అన్ని భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. ఇప్పటికీ ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‏లో ఆమె ఒకరు. అంతేకాదు.. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సింగర్స్ లో ఈమె ఒకరు..

ఈమె పాటలకే కాదు.. ఈమె గొంతుకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు.. ఆ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది శ్రేయా. ఇప్పుడు ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇప్పటివరకు ఈమె కూడబెట్టిన ఆస్తులు దాదాపు 200 కోట్లు వరకు ఉంటుందని అంచనా.. ఇక ఈమె ఒక్క పాటకు ఎంత తీసుకుంటుంది అనే విషయం పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది..

ఒక పాట కోసం శ్రేయా దాదాపు రూ. 25 లక్షలు తీసుకుంటుందట. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ లేదు. ఇటీవల అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో శ్రేయా ఘోషల్ సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ తో కలిసి కొన్ని పాటలు ఆలపించింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.. హిందీలో ఇప్పటివరకు ఈమె పాడిన పాటలు 200 లకు పైగా ఉంటుంది.. ఇక అన్ని భాషల్లో ఈమె పాట పాడింది…

Exit mobile version