NTV Telugu Site icon

SP GAUTAMI SHALI : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం

New Project (26)

New Project (26)

ప్రజలు శాంతియుతంగా ఉండాలని అనంతపురం ఎస్పీ గౌతమిశాలి సూచించారు. చట్టాన్ని చేతిలో తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ఆమె పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఇబ్బందులు పడుతారని చెప్పారు.
కౌంటింగ్ తర్వాత జిల్లాలో ప్రశాంత వాతావరణ నెలకొల్పడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. తాడిపత్రిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్, బిఎస్ఎఫ్ ఫోర్స్ అందుబాటులో ఉందని వెల్లడించారు. తాడిపత్రికి అదనంగా ఫోర్స్ రప్పించడం జరుగుతుందని తెలిపారు.

READ MORE: Delhi: ప్రైవేట్ భాగాలను బైక్‌తో తొక్కించి.. చేతులు, కాళ్లు కట్టి యువకుడి నోటిలో మూత్ర విసర్జన

కాగా.. ఎన్నికల అనంతరం తాడిపత్రిలో వరుసగా ఘర్షణలు చోటు చేసుకోవడాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ప్రాంతం పెద్దకన్నెళ్లి గ్రామానికి చెందినవారు. ఈమె ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. చెన్నైలో కాగ్నిజెంట్‌ కంపెనీలో ఉద్యోగం చేశారు. అదే సమయంలోనే యూపీఎస్పీకి ప్రయత్నించి 2015లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కర్నూలు అదనపు ఎస్పీగా, అనకాపల్లి ఎస్పీగా పనిచేశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆమె అనంతపురంలో శాంతి భద్రతలు నెలకొల్పడమే లక్ష్యమని పేర్కొన్నారు.