NTV Telugu Site icon

Karnataka Results: గ్రాండ్‌ విక్టరీ కొట్టిన కాంగ్రెస్‌.. సీఎం అయ్యేదెవరు..?

Dk Shivakumar

Dk Shivakumar

Karnataka Results: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.. సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌కు మించి మెజార్టీ సీట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.. ఇప్పటికే 137 స్థానాల్లో విజయాన్ని ఖరారు చేసుకున్న ఆ పార్టీ.. మరికొన్ని స్థానాల్లో విజయం ఖాయం అంటోంది.. ఇదే సమయంలో.. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష జేడీఎస్‌ రెండూ కలిసినా.. ఏమీ చేయలేని పరిస్థితి.. ఇంత వరకు బాగానే ఉంది.. ఊహించని మెజార్టీ అందుకున్న కాంగ్రెస్‌ పార్టీలో సీఎం అయ్యేది ఎవరు? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న సిద్ధరామయ్య మరోసారి సీఎం సీటు ఎక్కుతారా? కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న ట్రబుల్‌ షూటర్‌గా పేరుపొందిన డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారా? అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

అయితే, శివ‌కుమారా లేక సిద్ధిరామ‌య్యా..? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. సిద్ధిరామ‌య్యే సీఎం అవుతార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, డీకే శివ‌కుమార్‌కు కూడా ఆ పోస్టు ద‌క్కే ఛాన్స్‌ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో తన హవా కొనసాగిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ 137 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. బీజేపీ 62 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఇక, జేడీఎస్‌ అయితే దారుణంగ దెబ్బతిని 21కే పరిమితం అయ్యింది.. మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు గెలుపు దిశగా సాగుతున్నారు.. అయితే, ఈ రోజు సాయంత్రానికి సీఎం అభ్యర్థి ఎవరు? అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది..

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. కర్ణాటకలో విద్వేష రాజ్యం ముగిసింది.. ప్రేమతో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను గెలపించారు.. ఇది మనందరి విజయం.. కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, శ్రేణలకు ధన్యవాదులు తెలిపారు.. ఇక, ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధించబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు రాహుల్.. కానీ, కాబోయే సీఎం ఎవురు? అనే విజయాన్ని దాటవేశారు రాహుల్‌ గాంధీ.. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొలి కేబినెట్‌లోనే నెరవేరుస్తామని స్పష్టం చేశారు రాహుల్‌.

మరోవైపు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప తీర్పు ఇచ్చిన ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్‌ ఖర్గే కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగానే తాము అధికారం చేపట్టగానే అన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. పార్టీ గెలుపు కోసం సోనియా, రాహుల్‌, ప్రియాంక తమవంతు కృషి చేశారని, సోనియాగాంధీ ఆరోగ్యం బాగాలేకపోయినా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, వాళ్లకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఖర్గే చెప్పుకొచ్చారు.. అయితే, కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం కూడా సీఎం అభ్యర్థి ఎవరు? అనే విషయంలో స్పందించడంలేదు.. అంతర్గతంగా చర్చించన తర్వాతే సీఎల్పీ నేతలను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.. ఇక, ఈ రోజు సాయంత్రం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌.. ఇతర కీలక నేతలు ఉమ్మడిగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయబోతున్నారు. అప్పుడు ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.