Site icon NTV Telugu

DK Aruna : ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట… మోడీ కే మా ఓటు

Dk Aruna

Dk Aruna

ఎక్కడికెళ్లినా అందరి నోట ఒకటే మాట… మోడీ కే మా ఓటు.. గ్రామాల్లో ముసలి వాళ్ళు సైతం మోడీ కే ఓటు అంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీ కి ఓటు వేసుకున్న ఈ ఎన్నికల్లో మోడీ కే వేస్తామని అంటున్నారని, తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందన్నారు. 6 గ్యారంటీ లు అమలు కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు అని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా అని డీకే అరుణ అన్నారు. తెలంగాణ అభివృద్ది జరగాలి అంటే బీజేపీ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని, బీజేపీ లో పెద్ద యెత్తున చేరుతున్నారన్నారు.

 

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, మోడీనే గెలుస్తారని విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమే అధికారలోకి వస్తుందని.. మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version