NTV Telugu Site icon

DK Aruna : గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

Dk Aruna On Trs Allegations

Dk Aruna On Trs Allegations

ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పై బహిరంగంగా దాడి చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేసారు. మంగళవారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, గద్వాల్ నియోజకవర్గం లో జరిగిన ఓ బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో జిల్లా పరిషత్ చైర్మన్ సరితా, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి రాక ముందే ప్రారంభోత్సవం చేయడం పై భగ్గుమన్న ఎమ్మెల్యే, తమ పార్టీ నాయకుల పై ఉన్న కోపంతో ప్రభుత్వ అధికారి పై దాడి చేసి, దుర్బాషలాడడని డీకే అరుణ అన్నారు. వారి మద్య ఉన్న విభేదాల వల్ల ప్రభుత్వ అధికారి బలి కావాలా అని డీకే అరుణ ప్రశ్నించారు.
Also Read : Lancet Study: ఈ 5 బ్యాక్టీరియాలు భారతీయుల మరణాలకు కారణం అవుతున్నాయి.

వారి మధ్య ఉన్న పంచాయితీ పార్టీ కార్యాలయంలో లేదంటే వారి ఇళ్లల్లో చేసుకోవాలి, అంతే కాని అకారణంగా ప్రభుత్వ అధికారి పై చేయి చేసుకునే అధికారం ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి ఇచ్చాడా అని డీకే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సదరు అధికారికి ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. పోలీసులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని లేదంటే బీజేపీ ఆందోళనలు చేపడుతామన్నారు డీకే అరుణ. ఆ తరువాత జరిగే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డీకే అరుణ హెచ్చరించారు.
Also Read : CM KCR : ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాసరావు మృతిపై స్పందించిన కేసీఆర్‌.. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా