NTV Telugu Site icon

DK Aruna : ఫాంహౌజ్ ముఖ్యమంత్రికి ఇవ్వాళ పాలమూరు గుర్తొచ్చింది

Dk Aruna Comments

Dk Aruna Comments

ఫాంహౌజ్ ముఖ్యమంత్రికి ఇవ్వాళ పాలమూరు గుర్తొచ్చిందంటూ విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవాళ ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాయంలో మీడియాతో మాట్లాడుతూ.. 8 ఏండ్ల కింద పనులు ప్రారంభించి.. ఇవ్వాళ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చారన్నారు. కేసీఆర్.. ఇంకా అబద్ధపు ముచ్చట్లు మరవలేదన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తిచేస్తా, కుర్చీ వేసుకుని కూర్చుంట, కృష్ణ నీళ్లతో పాలమూరు ప్రజల కాళ్లు కడుగుత అన్నడని, ఆయన కడిగేదేంది? నేనే ఎన్నడో కృష్ణ జలాలతో పాలమూరు ప్రజల కాళ్లు కడిగిన అన్నారు. కేసీఆర్ ఒక జూటాకోర్ అని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా.. ‘నేను చేసిన త్యాగాలు, పోరాటాల వల్లే ప్రాజెక్టు సాధ్యమైంది. పాలమూరు-రంగారెడ్డి ఘనత నాదే.. నువ్వేం చేశావ్ కేసీఆర్.. పాలమూరు రైతులపై కేసీఆర్ కు చిన్న చూపు. బీమా, కోయిల్ సాగర్ ఇప్పటి వరకు పూర్తిచేయలేదు. వలసలను అరికట్టాలని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. ప్రాజెక్టుకు జీవో వచ్చేందుకు ఎంతోమంది ఇంజినీర్లు కష్టపడ్డారు. కానీ కేసీఆర్.. వచ్చి డిజైన్లు మార్చాడు. కమీషన్ల కోసమే ఇలా చేశాడు. కేసీఆర్.. మాయ మాటలతో పాలమూరు ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు ఉద్దెర ముచ్చట్లు మాట్లాడుతున్నావ్. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 570 టీఎంసీలు రావాలి. కానీ.. 2015లో కృష్ణా జలాల్లో 290 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది నువ్వు కాదా.. కేసీఆర్.. దక్షిణ తెలంగాణకు నీళ్లందించే విషయంలో కేసీఆర్ ది సవతి ప్రేమ. సంతకం పెట్టిన దాని ప్రకారం కాకుండా ఏపీ 640 టీఎంసీలు తీసుకుపోతోంది.
అదనంగా 135 టీఎంసీలు తీసుకుపోతున్నారు. కేసీఆర్.. నువ్ తోపు మాటలు మాట్లడి వచ్చావ్..

ఇప్పటి వరకు కనీసం భూసమీకరణ చేపట్టి రైతులకు డబ్బులు ఇచ్చావా? కేసీఆర్.. ఒక అజ్ఞాని. 31 పంపులకు ఒక్క పంపు ప్రారంభించిన నీకు సిగ్గుండాలి కేసీఆర్. నువ్వా బీజేపీపై విమర్శలు చేసేది?. మూడేళ్లలో పూర్తి చేస్తానని చెప్పి 8 ఏండ్లయినా పూర్తిచేయలేదు. ఒక్క పంపు పూర్తిచేసి ప్రారంభించింది ఎన్నికల కోసం కాదా? ఓట్ల కోసం కాదా?. ప్రాజెక్టు అడ్డుకున్నది నీ పక్కన ఎమ్మెల్యేగా ఉన్నాడు.. కొంచెమైనా సిగ్గుందా? కేసీఆర్. ఆర్డీఎస్ రైతులను నువ్వు మోసం చేయలేదా.. కేసీఆర్. 2018 లో తుమ్మిళ్ల లిఫ్ట్ కు అనుమతి తీసుకున్నావు.. దాన్ని ఎవరు అడ్డుకున్నారు?. ఆర్డీఎస్ కింద 85 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినవా?. దమ్ముంటే.. రా చూద్దాం.. ఎక్కడెక్కడ నీళ్లు పారించావో.. గట్టు లిఫ్ట్ ఏమైంది? తొమ్మిదేండ్లు పూర్తయింది.. ఎందుకు పూర్తి చేయలేదు. నీ ప్లేస్ లో నేనుంటే.. తెలంగాణలోని ప్రతి ఎకరాకు నీళ్లు అందించేదాన్ని. ఉద్యోగాలన్నీ నీ కుటుంబానికి పోయాయ్. నీదో దోపిడీ పాలన.
కేసీఆర్.. నా పేరు తీసుకునే అర్హత కూడా నీకు లేదు. నా నిజాయితీ ఎక్కడ? నీ అవినీతి ఎక్కడ?.’ అని డీకే అరుణ వ్యాఖ్యానించారు.

Show comments