Site icon NTV Telugu

Diwali Holiday: ఈ నెల 24నే దీపావళి సెలవు.. ప్రకటించిన కేసీఆర్‌ సర్కార్‌

Diwali Cm Kcr

Diwali Cm Kcr

ఈ సంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం అక్టోబర్‌ 25న దీపావళి పండుగ ఉంది. అయితే.. అదే రోజున సూర్య గ్రహణం ఉండటంతో ఏ రోజు దీపావళి పండుగ జరుపుకోవాలో స్పష్టతం లేకుండా పోయింది. దీంతో ప్రజల్లో ఏ రోజు పండుగ చేసుకోవాలనే అయోమయం నెలకొంది. అయితే.. దీపావళి అంటేనే ప్రత్యేకత ఉంది. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి. అంతేకాకుండా.. లక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. అయితే.. ఇన్నిటి మధ్య దీపావళి పండుగ జరుపుకోవడం సందిగ్ధత కొనసాగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పండుగపై స్పష్టతను ఇచ్చింది. ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న దీపావళి వస్తుంది. కానీ ఆ రోజు సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.

Also Read : Michael Teaser: నేను మనిషిగానే ఉంటాను మాస్టర్.. దేవుడు అవ్వాలనే ఆశ లేదు

ఆ రోజు అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని, అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి అందుకే పండుగ జరుపుకోవడం సరికాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 24న రాతంత్రా అమావాస్య గడియలు ఉంటాయి అందుకే ఆ రోజే పండుగ జరుపుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. 24న ఉదయం చతుర్దశి ఉంటుందని, రాతంత్రా అమవాస్య కొనసాగుతుందని వేదపండితులు వివరిస్తున్నారు. 24న లక్ష్మీదేవికి పూజ చేసి రాత్రి టపాసులు పేల్చి పండుగ జరుపుకోవాలని, క్యాలెండర్ ప్రకారం 25న పండుగ ఉండటం, పండితులు 24న జరుపుకోవాలని సూచిస్తుండటంతో.. దీపావళి పండుగ తేదీలపై నెలకొన్న అయోమయాన్ని ప్రభుత్వం నివృత్తి చేసింది. 24న దీపావళి పండుగ సెలవు ప్రకటించింది కేసీఆర్‌ సర్కార్‌.

Exit mobile version