Site icon NTV Telugu

Diwali 2025: దీపావళికి స్వీట్స్ కొంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

Sam

Sam

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95 స్వీట్ షాప్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2025 దీపావళి సందర్భంగా స్వీట్ షాప్‌లపై రైడ్స్ చేపట్టారు. అధికారులు 157 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్‌కి పంపారు. 60 కిలోల స్వీట్స్, 40 కిలోల బ్రెడ్ సీజ్ చేశారు. సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్న స్వీట్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్‌లకు నోటీసులు ఇచ్చారు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తింపు

కొన్ని స్వీట్ షాప్‌లలో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్పైరీ డేట్ లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. స్వీట్స్ తయారు చేసే స్థలంలో ఈగలు, దోమలు ఉన్నట్లు గుర్తించచారు. కిచెన్‌లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవట్లేదని యాజమాన్యంపై అధికారులు మండిపడ్డారు. స్వీట్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని, కిచెన్‌లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. స్వీట్‌లపై వేసే సిల్వర్ ఫాయిల్స్ క్వాలిటీ లేనివి వాడుతున్నట్లు చెప్పారు. కల్తీ నెయ్యి, కల్తీ వంట నూనెతో నిర్వాహకులు స్వీట్స్ తయారు చేస్తున్నారు.

Also Read: AUS vs IND: ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే.. గంభీర్‌కు ఇష్టమైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత!

దీపావళి గిరాకీ ఎక్కువగా వస్తుందని టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తుండటంతో.. క్రాస్ కంటామినేషన్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశముందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటున్నారు. FSSAI రిజిస్ట్రేషన్ ఉన్న షాప్స్ నుంచి మాత్రమే స్వీట్స్ కొనాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. కలర్ ఫుల్‌గా కనిపించే స్వీట్స్ అవాయిడ్ చేయడం బెటర్ అని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో దీపావళికి స్వీట్స్ కొనేవారు కాస్త జాగ్రతగా ఉండడం మంచిది.

 

Exit mobile version