Diwali 2025: దీపావళి పండుగ సంతోషకరమైన వాతావరణాన్ని, కాంతులను తీసుకువస్తుంది. అయితే బాణాసంచా కాల్చే ఉత్సాహం వల్ల లేదా దీపాల కారణంగా చిన్న నిప్పురవ్వలు, పేలుడు క్రాకర్ల వలన చర్మంపై కాలిన గాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రమాదాలు పండుగ ఆనందాన్ని బాధగా మార్చవచ్చు. అయితే చాలా వరకు చిన్న కాలిన గాయాలకు సరైన చికిత్స, సంరక్షణతో సులభంగా నయం చేయవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మచ్చలు పడకుండా పండుగను ఆస్వాదించవచ్చు.
Dil Raju : పవర్ స్టార్ కోసం రెండు స్క్రిప్ట్ లు రెడీ చేస్తున్న దిల్ రాజు టీమ్
ముఖ్యంగా కాలిన గాయం అయినప్పుడు తక్షణ చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. మొదటగా చేయవలసింది కాలిన ప్రాంతాన్ని వెంటనే చల్లబరచడం. ఇందుకోసం కాస్త నీటిని 5 నుండి 10 నిమిషాల పాటు గాయంపై నిరంతరాయంగా పడేలా చేయాలి. ఈ చర్య ఆ ప్రాంతాన్ని చల్లబరచడం ద్వారా వాపును తగ్గిస్తుంది. ఇంకా చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఐస్‌ను నేరుగా కాలిన గాయంపై వాడకూడదు. ఎందుకంటే ఇది రక్త ప్రవాహాన్ని పరిమితం చేసి గాయాన్ని మరింత తీవ్రం చేస్తుంది. చల్లబరచిన తర్వాత ఆ ప్రాంతాన్ని శుభ్రమైన గుడ్డతో మెల్లగా తుడవాలి. బొబ్బలు కనిపిస్తే, వాటిని వదులుగా ఉండే స్టెరైల్ గుడ్డతో కప్పాలి. చాలా మంది ఇళ్లలో వాడే పాత చిట్కాలైన టూత్‌పేస్ట్, నెయ్యి లేదా వెన్న వంటివి ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా.. వాటిని ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే, ఇవి గాయంపై వేడిని ఉంచి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల సరైన చికిత్స పద్ధతులను మాత్రమే అనుసరించాలి.
సరైన చికిత్స కోసం, కాలిన గాయాల తీవ్రతను గుర్తించడం ముఖ్యం. సాధారణంగా బాణాసంచా వలన కలిగే గాయాలు మూడు రకాలుగా ఉంటాయి. ఇందులో మొదటి-స్థాయి కాలిన గాయాలు (First-degree burns)లో చర్మం పైపొర మాత్రమే దెబ్బతిని, ఎరుపుదనం ఇంకా తక్కువ నొప్పి ఉంటాయి. ఇవి త్వరగా నయమవుతాయి. ఇక రెండవ స్థాయి కాలిన గాయాలు (Second-degree burns) గాయాలు చర్మం లోతుగా చొచ్చుకుపోయి, బొబ్బలు, వాపుతో పాటు ఎక్కువ నొప్పి ఉంటాయి. వీటికి జాగ్రత్తగా చికిత్స అవసరం. వీటికి సరిగ్గా చికిత్స చేస్తే మచ్చలు పడే అవకాశం తక్కువ. ఇక మూడవ స్థాయి కాలిన గాయాలు చాలా తీవ్రమైనవి. ఇవి చర్మం పూర్తిగా మాడిపోయి లేదా తెల్లటి మచ్చలతో కనిపిస్తాయి. ఇది వెంటనే వైద్య సహాయం (Medical Emergency) అవసరమయ్యే అత్యవసర పరిస్థితి. గాయం ముఖం, చేతులు లేదా సున్నితమైన భాగాలపై తగిలినా, లేదా అరచేతి కంటే పెద్దదిగా ఉన్నా, ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి.
Smriti Mandhana: ఓటమికి బాధ్యత నాదే.. టీమిండియా వైస్ కెప్టెన్
చిన్నపాటి కాలిన గాయాలకు ఇంట్లో సురక్షితంగా చికిత్స చేసుకోవాలంటే.. గాయాన్ని రోజుకు రెండు సార్లు తేలికపాటి, సువాసన లేని సబ్బు మరియు నీటితో సున్నితంగా కడగాలి. ఇంకా ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి, త్వరగా నయం కావడానికి యాంటీబయాటిక్ ఆయింట్‌మెంట్ లేదా బర్న్ క్రీమ్‌ను పలుచటి పొరగా రాయాలి. చిన్న కాలిన గాయాల అసౌకర్యం, ఎరుపుదనాన్ని తగ్గించడానికి స్వచ్ఛమైన కలబంద (Aloe Vera) జెల్ లేదా కలమైన్ లోషన్ ఉపయోగించవచ్చు. ఇంకా గాయంపై క్రిములు చేరకుండా రక్షించడానికి, స్టెరైల్, నాన్ స్టిక్ బ్యాండేజీని ఉపయోగించి కప్పాలి. బొబ్బలు ఏర్పడితే, వాటిని పగలగొట్టకుండా అలాగే ఉంచండి. అవి సహజ రక్షణ కవచాలుగా పనిచేస్తాయి. అనుకోకుండా పగిలితే, ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి, ఆయింట్‌మెంట్ రాయండి.
