Site icon NTV Telugu

Divya Bharathi : డైరెక్టర్ పై హీరోయిన్ షాకింగ్ ట్వీట్

Divya Bharathi

Divya Bharathi

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన పాగల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాత ఆ సినిమా‌ను బాగనే ప్రమోట్ చేసి.. ఏకంగా అల్లు అర్జున్ ఆర్య సినిమాతో కూడా ఆ సినిమాను పోల్చారు. అయిన కూడా వర్కౌంట్ అవ్వలే . ఆ తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు సురేష్. అయితే కొన్ని కారణాల వలన ఆ సినిమా నుంచి దర్శకుడుని తప్పించారు. దీంతో నిర్మాత ఆ సినిమాకు దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. దీంతో నరేష్ పైన రీసెంట్ గా ఆ సినిమాలో నటిస్తున్న దివ్యభారతి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్ చేశారు.

Also Read : Shriya Saran: “అది నేను కాదు” – ఫేక్‌ వాట్సప్‌ అకౌంట్‌ పై స్పందించిన శ్రియ

అయితే ముందుగా నరేష్ ట్విట్టర్ వేదికగా ఏమి లేబర్ రా నువ్వు, ఎడిట్ లో తీసి పడేసిన షాట్స్ తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావు. అసలు సెకండ్ లీడ్ యాక్టర్స్ చేయాల్సింది, ఈ చిలకతో వదిలావు. పోనీ మంచి ట్యూన్ ఏం చేసావురా? అంటూ నరేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ దివ్యభారతి దర్శకుడు నరేష్ పై మండిపడింది. ఆడవారిని“చిలకా” లేదా మరేదైనా పదంతో పిలవడం అనేది జోక్ కాదు,  ఈ దర్శకుడు సెట్‌లో ఇలాగే ప్రవర్తిస్తాడు, పదే పదే మహిళలను అగౌరవపరుస్తూ మరియు నిజాయితీగా, తానే అని చేస్తున్నట్లు చెబుతాడు. కానీ హీరో.. తనని అన్ని మాటలు అంటూన్న  సైలెంట్ గా ఉండటం చూసి నాకు చాలా బధ అనిపించింది, ఈ సంస్కృతిని మరొక రోజు మనుగడ సాగించడానికి అనుమతిస్తున్నాను. ఇక పై నేను ఎంచుకునే ప్రాజెక్ట్‌లలో, ప్రతి స్వరం, ప్రతి మాట గౌరవపూర్వకంగా ఉండేలా చూస్తాను. ఇది కేవలం ఎంపిక మాత్రమే కాదు, కళాకారిణిగా మరియు మహిళగా చేసిన ప్రమాణం!”అంటూ దివ్యభారతి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

అయితే, నరేష్ గతంలో జబర్దస్త్ షోకి రైటర్‌గా పనిచేసిన నేపథ్యం కూడా ఉంది. ఆ పరిచయం వల్ల సెట్లో సదరు వ్యవహారం చోటు చేసుకున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు ప్రశ్న ఇది – దివ్యభారతి వ్యాఖ్యలపై నరేష్ ఎలా స్పందిస్తారు? మరియు ఈ విషయాన్ని ఇండస్ట్రీ సీరియస్‌గా తీసుకుంటుందా? ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ మరియు సినీ ప్రపంచం ఎదురుచూస్తున్న అంశం.

Exit mobile version