నటినటులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నప్పుడు అవి ఒక్కోసారి సంచలనంగా మారుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల పెళ్లి గురించి వచ్చే వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్య పెళ్లి అనే కాన్సెప్ట్‌పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఒక టాక్ షోలో పాల్గొన్న దివి, పెళ్లి పట్ల తనకు ఉన్న భయాన్ని.. భిన్నాభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, కానీ ఇప్పటివరకు సరైన మ్యాచ్ దొరకలేదని చెబుతూనే.. అసలు తనకు మ్యారేజ్ అనే సిస్టమ్ మీద నమ్మకం లేదని బాంబు పేల్చింది.
Also Read : Pushpa 2 Japan : తెలుగులో మాట్లాడి షాకిచ్చిన జపాన్ ఫ్యాన్.. అల్లు అర్జున్ క్రేజీ రియాక్షన్!
దివి మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో పెళ్లయిన వారిలో దాదాపు 90 శాతం మంది రెండు, మూడు ఏళ్లకే విడిపోయారు. అందుకే నాకు పెళ్లంటే భయమేస్తోంది. పెళ్లి కంటే లివింగ్ రిలేషన్ షిప్ (Living Relation) బెటర్ అని నా అభిప్రాయం. ఒక వ్యక్తితో నిజాయితీగా, కమిట్‌మెంట్‌తో ఉంటే అదే పెళ్లితో సమానం. పెళ్లికి ముందు ఉన్న స్వేచ్ఛ, సంతోషం పెళ్లి తర్వాత చాలామందిలో కనిపించడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ పెళ్లయ్యాక మనస్పర్థలు వస్తే ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేసుకోవడం కంటే విడిపోవడమే మంచిదని ఆమె అభిప్రాయపడింది. తన క్యారెక్టర్ దెబ్బతిననంత వరకు అడ్జస్ట్ అవుతానని, కానీ తన ఇష్టాలను పూర్తిగా చంపేసుకుని మాత్రం ఉండలేనని స్పష్టం చేసింది. యువతలో రిలేషన్ షిప్స్ పట్ల మారుతున్న ధోరణికి దివి చేసిన ఈ కామెంట్స్ అద్దం పడుతున్నాయి.
