డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న వాళ్లందరు యూపీఐ సేవలను వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడు యూపీఐ సర్వర్ డౌన్ కావడంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో సహా భారత్ లోని అనేక నగరాల్లో శనివారం మధ్యాహ్నం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. చాలా మంది UPI ద్వారా చెల్లింపులు చేయలేకపోతున్నారు.
Also Read:Shalini Pandey: ఆ హీరోతో రొమాన్స్ చేయాలనేది నా కోరిక..
Paytm, PhonePe, G Pay వినియోగదారులు UPI చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. పేమెంట్స్ ఫెయిల్ అవడంతో సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. నెట్‌వర్క్ స్లో అని, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా సాధ్యం కావట్లేదంటూ వాపోతున్నారు. UPI QR కోడ్‌ను స్కాన్ చేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత కూడా చెల్లింపు ప్రక్రియ పూర్తి కావడం లేదని యూజర్లు వెల్లడించారు. యూపీఐ సర్వర్ డౌన్ కు గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఇటీవల కొద్ది రోజుల వ్యవధిలోనే యూపీఐ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.