NTV Telugu Site icon

Raghu Raju: ఎమ్మెల్సీ ర‌ఘురాజు పై అన‌ర్హత వేటు..

New Project (22)

New Project (22)

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి వేళ సంచలన పరిణామం చోటు చేసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్‌సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎన్నికల ఫలితాల వేళ మండలి ఛైర్మన్ నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీపై వైఎస్సార్‌సీపీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు సోమవారం శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పై అనర్హత వేటు పడింది.

READ MORE: Swami Paripoornananda: ఏపీ ఫలితాలపై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు..వైసీపీకి 123 సీట్లు ఖాయం!

లోకేశ్ సహా టీడీపీ నాయకులతో రఘురాజు అంటకాగుతున్నారని వైసీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీతో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు మే 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు నోటీసులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. మళ్లీ మే 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇవ్వగా విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రి డ్రామా ఆడారు. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.