Site icon NTV Telugu

TTD: తిరుమలలో ఎట్టకేలకు ముగిసిన వివాదం..

Ttd

Ttd

TTD: టీటీడీ పాలకమండలి సభ్యుడు.. ఉద్యోగి మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు ముగిసింది. మూడు రోజులు క్రితం మహాద్వారం గేటు తెరిచే అంశంపై పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్… టీటీడీ ఉద్యోగి బాలాజీ మధ్య తలెత్తిన వివాదానికి ఉద్యోగ సంఘ నేతలు ముగింపు పలికారు. టిటిడి పాలకమండలి సభ్యులు నరేష్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపలికి విచ్చేసే సమయంలో మహాద్వారం వద్ద గేటు తీయడానికి ఉద్యోగి బాలాజీ నిరాకరించడంతో.. ఆ ఉద్యోగి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యపదజాలంతో పాలకమండలి సభ్యుడు నరేష్ దూషించారు.. దీంతో, టిటిడి ఉద్యోగ సంఘ నేతలు ఆందోళనకు దిగారు. టిటిడి ఉద్యోగికి పాలకమండలి సభ్యులు క్షమాపణలు చెప్పాలంటూ టిటిడి పరిపాలన భవనం వద్ద ఆందోళన చేపట్టారు.. నిన్న ధర్నా చేసిన ఉద్యోగులు.. ఇవాళ మౌనదీక్షకు దిగారు. ఇక, 24వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని టిటిడికి అల్టిమేటం జారీ చేశారు. దీనితో పాలకమండలి సభ్యుడికి ఉద్యోగుల మధ్య సయోధ్య కుదుర్చేందుకు రంగంలోకి దిగిన టిటిడి ఉన్నతాధికారులు ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. ఇవాళ సాయంత్రం అన్నమయ్య భవన్ లో ఉద్యోగ సంఘ నేతలతో టిటిడి ఈవో, అడిషనల్ ఈవోతో పాటు పాలకమండలి సభ్యులు సమావేశమయ్యారు. జరిగిన వ్యవహారంకు ఉద్యోగి బాలాజీకి సభ్యుడు నరేష్ క్షమాపణలు చెప్పడంతో ఆందోళన విరమించారు ఉద్యోగులు.

Read Also: Uttam Kumar Reddy : గత ప్రభుత్వం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం

Exit mobile version