Site icon NTV Telugu

Disha Patani Bikini: బికినీలో దిశా పటానీ.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!

Disha Patani Bikini

Disha Patani Bikini

Disha Patani bikini pics shakes internet: బాలీవుడ్ బ్యూటీ ‘దిశా పటానీ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లో కంటే.. సోషల్ మీడియాలోనే అమ్మడు ఎక్కువ రచ్చ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండే దిశా.. హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. తరచూ బికినీల్లో కనిపిస్తూ మతి పోగొడుతూ ఉంటారు. ఎంతలా అంటే.. బికినీ వేయడంలో దిశా తర్వాతే ఎవరైనా అనేంతలా. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట హీటు పెంచాయి.

దిశా పటానీ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నారు. తన స్నేహితులతో కలిసి అక్కడ విహారయాత్రలో ఉన్నారు. హాట్ సమ్మర్‌ను థాయ్‌లాండ్‌లోని బీచ్‌లో దిశా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రౌన్ కలర్ బికినీ ధరించి సముద్ర తీరంలో సేదతీరారు. ఇందుకు సంబందించిన ఫొటోస్‌ను దిశా శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. దిశా గ్లామర్‌కు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది.

Also Read: Hardik Pandya: హార్దిక్‌ పాండ్యాను చూస్తే బాధేస్తోంది: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌

2016లో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో దిశా పటానీ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. భాగీ, భారత్‌, మలంగ్‌ లాంటి సినిమాలతో ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టైగర్ ష్రాఫ్‌తో ప్రేమాయణం ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇటీవల ఆమె యోధాతో మంచి విజయంను ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ, కంగువ సినిమాలలో నటిస్తున్నారు.

Exit mobile version