Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా – డిస్కో శాంతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి,డిస్కో శాంతిలది అన్యోన్యమైన జంట అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే, తమిళం, తెలుగు సినిమాల్లో ఒకప్పుడు తన డాన్స్‌తో ఒక ఊపు ఊపిన డిస్కో శాంతి, దాదాపు 11 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. 1986లో ‘ఉదయగీతం’తో మొదలైన ఆమె ప్రస్థానం, ఐటెం సాంగ్స్ క్వీన్‌గా ఆమెను నిలబెట్టింది. ఆమె భర్త శ్రీహరి మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’లో ఆయన చేసిన షేర్ ఖాన్/సొలోమన్ పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి, శ్రీహరి ‘మగధీర’ సినిమా అంగీకరించే సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Also Read : Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
శ్రీహరి అప్పటికే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ సమయంలో ‘మగధీర’లో సహాయ నటి (Supporting Role) పాత్ర వస్తుందని తెలియగానే డిస్కో శాంతి వద్దని వారించారట.. ‘ఒక హీరో భార్యగా.. హీరో వేరు, సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు అనే ఆలోచన నాలో ఉండేది. కానీ రాజమౌళి సినిమాలో హీరోగా అయితే చేయమని చెప్పేదాన్ని, కానీ క్యారెక్టర్ రోల్ అనగానే వద్దని బావకు చెప్పాను. మొదట శ్రీహరి గారు ఈ కథను పూర్తిగా చెప్పలేదు. కానీ సినిమా విడుదలయ్యాక, అందులో షేర్ ఖాన్ పాత్ర ప్రాముఖ్యత చూసి ఆశ్చర్యపోయా. ఈ క్యారెక్టర్ లేకపోతే మగధీర సినిమానే లేదు అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. రాజమౌళి ఆ క్యారెక్టర్‌ను ఎంత మనసు పెట్టి చేయించారో అప్పుడు తెలిసింది’ అని ఆమె ఎమోషనల్ అయ్యారు. ‘సలాం షేర్ ఖాన్’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఇప్పటికీ థియేటర్లలో మారుమోగుతూనే ఉంటుంది.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!