Site icon NTV Telugu

Andhrapradesh: 63.14 లక్షల మందికి రూ.1739.75 కోట్లు.. నేటి నుంచి పింఛన్ల పంపిణీ

Ysr Pension Kanuka

Ysr Pension Kanuka

Andhrapradesh: నేటి నుంచి ఏపీలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వితంతు, దివ్యాంగులు, వివిధ చేతివృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తు­లకు గురు­వారం నుంచి పింఛన్ల పంపిణీ జరగనుంది. లబ్ధిదా­రుల సంఖ్య ఆధారంగా ఈ డబ్బులను బుధవా­రమే ఆయా గ్రామ/వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయగా.. స్థానిక సిబ్బంది నిధులను డ్రా చేసి, వాలంటీర్ల వారీగా పంపిణీ కూడా చేశారు.

Read Also: Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్.. నేడు రైతుల ఖాతాల్లోకి నిధులు

గురువారం తెల్లవారు­జాము నుంచి తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్మును వాలంటీర్లు అందజేస్తారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపా­రు. వాలంటీర్ల ఆధ్వర్యంలో 5వ తేదీ వరకు లబ్ధి­దారుల ఇంటి వద్దనే ఈ పంపిణీ కొనసాగుతుందని.. ఎలాంటి ఫిర్యా­దులు లేకుండా పంపిణీ ప్ర­క్రియ కొనసాగేందుకు 26 జిల్లాల్లో డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్‌ సెంటర్లనూ ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

Exit mobile version