NTV Telugu Site icon

Kalki 2898 AD: ఇది తెలుసా?.. ‘కల్కి 2898 ఏడీ’లో స్టార్ డైరెక్టర్లు!

Rajamouli In Kalki

Rajamouli In Kalki

Directors SS Rajamouli and RGV Play Guest Roles in Kalki 2898 AD: ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పురాణాలు, ఇతిహాసాలను ఆధారంగా తీసుకుని.. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా కల్కిని రూపొందించారు. ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్స్‌ నటించడంతో ఈ చిత్రంపై ముందు నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది. ఎన్నో అంచనాల మధ్య ఈరోజు కల్కి రిలీజ్ అయింది. ఈ సినిమాలో చాలామంది స్టార్ గెస్ట్ రోల్స్ చేశారు.

కల్కి 2898 ఏడీ చిత్రంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గెస్ట్ రోల్ చేశారు. బౌంటీ హంటర్ అనే పాత్రలో జక్కన్న మెరిశారు. రాజమౌళి స్రీన్ మీద కనిపించగానే థియేటర్లో ఫాన్స్ ఈలలు, కేకలు వేసి హంగామా చేశారు. రాజమౌళి తన సినిమాల్లోనే అప్పుడప్పుడు మెరుస్తాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా ఉన్నారు. ఆర్జీవీ చింటూ అనే క్యారెక్టర్ చేశారు.

Also Read: Kalki 2898 AD Guest List: ‘కల్కి 2898 ఏడీ’లో గెస్ట్ రోల్స్ లిస్ట్ పెద్దదే.. అస్సలు ఊహించని పేర్లు!

ఇక కల్కి 2898 ఏడీలో హీరోలు దుల్కర్‌ సల్మాన్‌, విజయ్ దేవరకొండ.. హీరోయిన్స్ మృణాళ్‌ ఠాకూర్‌, మాళవిక నాయర్, ఫరియా అబ్దుల్లాలు కూడా ఉన్నారు. ఇందులో ప్రభాస్ సహా దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటాని, శోభన, అన్నా బెన్ కీలక పాత్రలు చేశారు.