Mahua Moitra: మహువా మొయిత్రాకు షాకిచ్చిన కోర్టు.. దెబ్బకు బంగ్లా ఖాళీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC EX MP: లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసింది. ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆమెకు కేటాయించిన ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు జారీ చేసిన నోటీసుపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఇవాళ బంగ్లా ఖాళీ చేయడంతో డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ విభాగ అధికారులు ఆ ప్రభుత్వ బంగ్లాకు తాళం వేసుకుని వెళ్లిపోయారు.
Read Also: NZ vs PAK: న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్‌కు కరోనా పాజిటివ్.. ఇది రెండో కేసు!
Also Read
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
కాగా, డిసెంబరు 8న మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీలోగా ఆమెకు కేటాయించిన అధికార నివాసాన్ని ఖాళీ చేయాలంటూ గతంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ విభాగ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.. కానీ, ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో డీఓఈ అధికారులు తగిన చర్యలు చేపట్టింది.
Read Also: RBI Penalty: ఐదు బ్యాంకులపై రూ.50 లక్షల జరిమానా విధించిన రిజర్వ్ బ్యాంక్
ఇక, లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని.. అలాగే, పార్లమెంట్ లాగిన్‌ను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు పేర్కొనింది. ఈ నివేదికకు లోక్‌సభ ఆమోదం లభించడంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి.. సభ నుంచి బహిష్కరించింది.
తాజావార్తలు
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
-
Suryakumar Yadav-MI: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై?.. ఇదే ప్రూఫ్!
-
Ram Gopal Varma : పెద్ద స్లార్లకు, భారీ బడ్జెట్ డైరెక్టర్లకు RGV కౌంటర్… హాలీవుడ్ హారర్ పై వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!