NTV Telugu Site icon

Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు అన్నా.. సినిమాలకు రిటైర్‌మెంట్‌ ఇస్తా: డైరెక్టర్ విక్రమ్‌

Roti Kapada Romance

Roti Kapada Romance

‘రోటీ కపడా రొమాన్స్‌’ మూవీ చూసి.. ఒక్కరు బాగోలేదని చెప్పినా తాను సినిమాలకు రిటైర్‌మెంట్‌ ఇస్తా అని డైరెక్టర్ విక్రమ్‌ రెడ్డి చెప్పారు. ఈ చిత్రంతో మల్టీప్లెక్స్‌లు కాస్త మాస్‌ థియేటర్‌లు అవుతాయన్నారు. రోటీ కపడా రొమాన్స్‌ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చినా.. మూవీలో శ్రుతిమించిన రొమాన్స్‌ ఏమాత్రం ఉందన్నారు. తన మిత్రుల జీవితాల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ కథ సిద్ధం చేసుకున్నా అని విక్రమ్‌ రెడ్డి తెలిపారు. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన రోటీ కపడా రొమాన్స్‌ మూవీ నవంబర్ 28న విడుదల అవుతోంది. బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్‌ బొజ్జం నిర్మించారు.

రిలీజ్ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన విక్రమ్‌ రెడ్డి పలు విషయాలు పంచుకున్నారు. ‘నా స్నేహితుల జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల్ని ఆధారం చేసుకుని.. ఈ కథ రాసుకున్నా. ప్రేమ, స్నేహం, వినోదం అన్ని ఉంటాయి. సినిమాలో నాలుగు ప్రేమ కథలు ఉంటాయి. నలుగురు అబ్బాయిల జీవితాల్లోకి అమ్మాయిలు వచ్చాక వారి జీవితాలు ఎలా మారాయి?, ప్రేమలో విఫలమయ్యాక వాళ్లు ఏం తెలుసుకున్నారు? అన్నది స్టోరీ. చిరి 15 నిమిషాలు ప్రతి ఒక్కరి మనసుల్ని హత్తుకుంటుంది. ఏ సర్టిఫికెట్‌ దక్కినా.. శ్రుతిమించిన రొమాన్స్‌ ఉండదు. ఈ చిత్రంతో మల్టీప్లెక్స్‌లు మాస్‌ థియేటర్‌లవుతాయి. సినిమా బాగోలేదని ఒక్కరు చెప్పినా సినిమాలకు రిటైర్‌మెంట్‌ ఇస్తా’ అని విక్రమ్‌ రెడ్డి చెప్పారు.

Also Read: Subbaraju Marriage: లేటు వయసులో పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు.. వధువు ఎవరంటే?

‘రోటీ కపడా రొమాన్స్‌ సినిమాను ముందుగా దిల్‌రాజు చేద్దామనుకున్నారు. కథలో కొన్ని మార్పులు చేయమంటే.. నేను ఒప్పుకోలేదు. నా నిర్ణయాన్ని దిల్‌రాజు స్వాగతించారు. ఈ సినిమాకి ఆయనే టైటిల్‌ ఇచ్చారు. సినిమా హక్కులు ముందే అమ్మేయడం వల్ల విడుదల తేదీ విషయంలో కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నాం. థియేటర్లు దొరక్కపోవడం కూడా మరో కారణం. అందుకే పలుసార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈటీవీ విన్‌, పంపిణీదారుల సలహాతో రిలీజ్ చేస్తున్నాం’ అని విక్రమ్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.